హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి ముందస్తు ముచ్చట.. రాష్ట్రపతి పాలన అంటున్న ఉత్తమ్, సమయం ప్రకారమే: బాల్క

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి మరోసారి చర్చకు దారితీసింది. వాస్తవానికి వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సమయం ఉంది. కానీ ఈ డిసెంబర్‌లోనే కేసీఆర్ ఎన్నికలకు వెళతారనే ప్రచారం ఉంది. గుజరాత్‌లో డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు వెళితే బీజేపీ కూడా పెద్దగా పట్టించుకోదని కేసీఆర్ ఆలోచన అని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు అని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఖండించారు. అబ్బే అదేం లేదని స్పష్టంచేశారు.

రాష్ట్రపతి పాలనే..

రాష్ట్రపతి పాలనే..

సీఎం కేసీఆర్ మాత్రం గ‌తంలో మాదిరే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయనే వార్త‌లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, న‌ల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిపినా...రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించిన త‌ర్వాతే జ‌ర‌పాల‌ని కామెంట్ చేశారు. సోమ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌లు, టీఆర్ఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే ప్ర‌మాదంపై కీల‌క చ‌ర్చ జ‌రిగింది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా రాష్ట్రప‌తి పాల‌న‌లోనే జ‌ర‌గాలి. ముంద‌స్తు ఎన్నికల‌కు వెళ్లినా ఇదే డిమాండ్ చేస్తాం అని అన్నారు.

నిర్ణీత సమయంలోనే

నిర్ణీత సమయంలోనే


ఉత్తమ్ వెర్షన్ ఇలా ఉండగా.. దానిని అధికార పార్టీ ఖండించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి సంబంధించి ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్పందించారు. ముంద‌స్తు ముచ్చ‌టే లేదని తేల్చి పారేశారు. గ‌తంలో మాదిరే టీఆర్ఎస్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే మొగ్గు చూపుతోంద‌న్న ప్ర‌చారంపై స్పందించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోమ‌ని బాల్క సుమ‌న్‌ స్పష్టంచేశారు. నిర్ణీత వ్య‌వ‌ధి ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు.

కేసీఆర్ సార్ ఏం చేస్తారో

కేసీఆర్ సార్ ఏం చేస్తారో


మరీ కేసీఆర్ మదిలో ఏముందో ఎవరకీ తెలియదు.. కానీ ముందస్తు అనే రూమర్ మాత్రం చాలా రోజులుగా జరుగుతుంది. ఇటు గతంలో 6 నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్లారు. మరీ ఈ సారి ఏకంగా ఏడాది సమయం ఉండగా.. అసెంబ్లీని రద్దు చేసే సాహసం చేస్తారా అనే సందేహాం కలుగుతుంది. కానీ సర్వే రిపోర్టులు.. పార్టీ ప్రభ నేపథ్యంలో ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటివరకు దీనికి సంబంధించి ఊహాగానాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి.

English summary
if pre poll in telangana state impose president rule congress senior leader Uttam kumar reddy asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X