హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బర్త్ డేకు ముందే బెణికిన చీలమండ: ఇంటి వద్దే మంత్రి కేటీఆర్ రెస్ట్, 3 వీక్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం కింద పడిపోయారు. దీంతో అతని కాలు చీలమండకు దెబ్బ తగిలింది. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని కోరారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో ఉండే కేటీఆర్ శ‌నివారం ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో కింద ప‌డిపోయార‌ు. కాలు చీల‌మండ‌కు గాయం అయ్యింది. ఇంటికి చేరిన కేటీఆర్‌... కాలి చీల‌మండ‌కు పెద్ద బూటు లాంటి బ్యాండేజీతో క‌నిపించారు.

కార్య‌క్ర‌మంలో కింద ప‌డిపోవడంతో చీల‌మండకు గాయమైంది. ఈ విషయాన్ని కేటీఆరే సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. చీల‌మండ‌కు బ్యాండేజీ వేసుకుని కాలు జాపుకుని కూర్చున్న ఫొటోను దానికి జ‌త చేశారు. వైద్యులు 3 వారాల పాటు విశ్రాంతి అవ‌సర‌మ‌ని తెలిపార‌ని చెప్పారు. 3 వారాల పాటు కాల‌క్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి కార్య‌క్ర‌మాలు ఉంటే తెల‌పాలని కోరారు.

minister ktr fell down, injured his ankle

ఓటీటీలో ఏమైనా మంచి షోలు ఉంటే.. వాటి వివరాలు చెప్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓటీటీ షోల వివరాలు చెబుతూనే.. గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ.. రిప్లయ్ ఇస్తున్నారు.

మంత్రి కేటీఆర్ మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ తొలి స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత కేటీఆర్ కాలుకి గాయం అయినట్టు తెలుస్తోంది. జూలై 24వ తేదీన (ఆదివారం) కేటీఆర్ పుట్టినరోజు. బర్త్ డే ముందు రోజే ఇలా జరగడంపై ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో బర్త్ డే వేడుకలు జరపొద్దని కేటీఆర్ ఇప్పటికే సూచించారు. ఇప్పుడు 3 వారాల పాటు ఇంటి పట్టునే ఉండనున్నారు.

English summary
minister ktr fell down injured ankle. doctors suggested 3 weeks take rest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X