• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రయాణీకులకు వినోదం.. దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయోగం.. గ్రామాలకు మినీ థియేటర్లు

|

హైదరాబాద్ : ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా దక్షిణ మధ్య రైల్వే దూసుకెళుతోంది. ఇప్పటికే పలు రకాల సేవలతో అందరి మన్ననలు పొందుతోంది. అందులోభాగంగా ఉచిత వై ఫై సౌకర్యం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా వినోదం పేరిట సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్ల ప్రాంగణంలో మినీ మొబైల్ థియేటర్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో 8 మొబైల్ థియేటర్లను ప్రారంభించింది.

రైల్వే స్టేషన్లలో ట్రైన్ల కోసం వేచి ఉండే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా తొలుత 8 స్టేషన్లలో ప్రారంభించింది. రానురాను దశలవారీగా విస్తరించనుంది.

 మినీ థియేటర్లు ఇక్కడే ఫస్ట్..

మినీ థియేటర్లు ఇక్కడే ఫస్ట్..

బెస్ట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ కల్పించడం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు వినోదం అందించేందుకు సిద్ధమైంది. మినీ మొబైల్ థియేటర్లను పిక్చర్ టైమ్ పేరిట ప్రారంభించింది. తెలంగాణలో కాచిగూడ, కామారెడ్డి, మహబూబ్ నగర్, బాసర, మల్కాజిగిరి, బొల్లారం స్టేషన్లలో శుక్రవారం నుంచి ఇవి అందుబాటులోకి వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మినీ మొబైల్ థియేటర్లలో తెలుగు, హిందీ సినిమాలతో పాటు ప్రభుత్వ విభాగాల కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ తదితర అంశాలు ప్రదర్శించనున్నారు.

మినీ సెటప్.. బొమ్మ అద్భుతం

మినీ సెటప్.. బొమ్మ అద్భుతం

ప్రయాణీకులకు మంచి అనుభూతి అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వినోద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఒక డిజిటల్‌ స్క్రీన్, 5.1 డాల్బీ సౌండ్‌ సిస్టం, దాదాపు 150 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీ వీటి ప్రత్యేకత. అయితే ఈ మొబైల్ థియేటర్లు ఒకచోట కాకుండా ఆయా స్టేషన్ల ప్రాంగణంలో వీలున్నచోట ఎక్కడైనా సెటప్ చేసే సౌలభ్యముంది.

పిక్చర్‌ టైమ్‌.. డిజిటల్ మానియా

పిక్చర్‌ టైమ్‌.. డిజిటల్ మానియా

పిక్చర్‌ టైమ్‌ సంస్థ రూపొందించిన ఈ మినీ మొబైల్ థియేటర్లు దేశవ్యాప్తంగా సందడి చేయనున్నాయి. సినిమాహాళ్లు లేనిచోటకు, మారుమూల ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో వీటికి మంచి స్థానం లభించనుంది. రిమోట్ ఏరియాల్లో తమ ఊళ్లకే సినిమా హాల్ వచ్చిన అనుభూతి గ్రామ ప్రజలకు లభించనుంది. టికెట్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండనుంది. అయితే వీటిలో కొత్త సినిమాలు కూడా ప్రదర్శించనుండటంతో గ్రామాల్లో ఆదరణ లభించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ట్రైబల్స్ ఏరియాల్లో కూడా ఇవి ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పరిశుభ్రత, అంటువ్యాధులు, బాల్యవివాహాలు తదితర సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడనున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The South Central Railway, which has been able to provide better service for passengers, has opened a new experiment in the name of entertainment. The mini mobile theaters in the premises of the railway stations were scratched. These mini mobile theaters, Organized by Picture Time, will be entertaining nationwide. They are expanding to remote areas, where there are no cinema halls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more