వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సినిమా చూడ్డానికి ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌గా సెలవు ఇచ్చిన ముఖ్యమంత్రి

|
Google Oneindia TeluguNews

గువాహటి: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మూవీ- ది కాశ్మీరీ ఫైల్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, బ్రహ్మదత్, ప్రకాష్ బెళవాడి, పల్లవీ జోషి నటించిన బాలీవుడ్ సినిమా ఇది. వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు. 1990వ దశకంలో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందుల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కింది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని నిర్మాణ వ్యయం 12 కోట్ల రూపాయలు. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే దీనికి రెట్టింపు కలెక్షన్లను సాధించింది.

Recommended Video

The Kashmir Files ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా PM Modi ప్రశంసలు Tax సైతం మినహాయింపు | Oneindia Telugu

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనవర్షం కురుస్తోంది. 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్తరాదిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌ను సైతం మినహాయించాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపులను ప్రకటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ది కాశ్మీర్ ఫైల్స్‌ను ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని పిలుపునిచ్చారు.

Assam CM given half-day leave to the govt employees to watch the The Kashmir Files movie

కాగా- తాజాగా అస్సాం ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా స్పెషల్ లీవ్‌ను ఇచ్చింది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ సినిమాను చూడాలని సూచించింది. ఈ సినిమా చూశామనడానికి సాక్ష్యంగా ఉద్యోగులు- టికెట్లను తమ శాఖలు, విభాగాధిపతులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. టికెట్లను ఇచ్చిన వారికి హాఫ్ డే సెలవును మంజూరు చేయాలని ఆదేశాలను జారీ చేసింది.

ది కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూడ్డానికి తమ ఉద్యోగులకు అర్ధ రోజు ప్రత్యేకంగా సెలవును మంజూరు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ హాఫ్ డే స్పెషల్ లీవ్ కోసం తమ పైఅధికారి వద్ద అనుమతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. సినిమా చూసొచ్చిన అనంతరం మరుసటి రోజు టికెట్లను తప్పనిసరిగా పైఅధికారులకు అందజేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు చిత్రం యూనిట్‌ను ప్రశంసిస్తోన్నారు. అద్భుతంగా దీన్ని చిత్రీకరించారని చెబుతున్నారు. సున్నితమైన కథను అంతే సున్నితంగా ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఆశ్చర్య పరుస్తోందని చెబుతున్నారు. వాస్తవాలను ప్రతిబింబించే ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని సూచిస్తున్నారు.

English summary
Assam Chief Minister Himanta Biswa Sarma on Tuesday mentioned the state authorities workers shall be entitled for particular “half-day leave” to look at the movie ‘The Kashmir Files’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X