వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ ?- కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌, ఎయిమ్స్‌ ఛీఫ్ సిఫార్సు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రోజురోజుకూ ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది పెట్టిన లాక్‌డౌన్ కంటే మరింత కఠినమైన లాక్‌డౌన్ విధిస్తే కానీ పరిస్ధితులు అదుపులోకి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. దీంతో కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.

Recommended Video

COVID Vaccine For 18+ : నోస్టాక్..వ్యాక్సిన్ కోసం జనం బారులు... Vaccines Shortage || Oneindia Telugu
మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌

మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌


దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఓవైపు పరీక్షలకు అవసరమైన కిట్ల కొరత, మరోవైపు వ్యాక్సిన్‌ కొరత ప్రభుత్వాల్ని వేధిస్తున్నాయి. దీంతో మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేంద్రానికి కీలక ప్రభుత్వ విభాగాల నుంచి సిఫార్సులు కూడా అందుతున్నాయి. దీంతో త్వరలో లాక్‌డౌన్‌పై కేంద్రం ప్రకటన చేయొచ్చనే వాదన ఊపందుకుంటోంది.

 కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌, ఎయిమ్స్‌ ఛీఫ్ సిఫార్సు

కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌, ఎయిమ్స్‌ ఛీఫ్ సిఫార్సు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిని అడ్డుకోవాలంటే దేశవ్యాప్తంగా మరోసారి కఠినమైన లాక్‌డౌన్ విధించకతప్పదని కేంద్రం నియమించిన కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్ సభ్యులతో పాటు ఢిల్లీ ఎయిమ్స్‌ ఛీఫ్ కూడా కేంద్రానికి సిఫార్సు చేశారు. కఠినమైన లాక్‌డౌన్‌ విధింపు ద్వారానే వైరస్‌ చైన్‌ను బ్రేక్ చేయడం సాధ్యపడుతుందని వారు కేంద్రానికి సూచించారు. దీంతో ఈ సిఫార్సులు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ భేటీ

కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ భేటీ

కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకునేందుకు నియమించిన కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎయిమ్స్‌తో పాటు ఐసీఎంఆర్‌కు చెందిన పలువురు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పౌల్‌ దీనికి ఛైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ పలుమార్లు భేటీ అయి దేశవ్యాప్తంగా కరోనా తాజా పరిస్దితులపై చర్చించి ప్రధాని మోడీకి లాక్‌డౌన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో టాస్క్‌పోర్స్‌ చేసిన సిఫార్సుపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

చివరి ఆప్షన్‌గానే లాక్‌డౌన్

చివరి ఆప్షన్‌గానే లాక్‌డౌన్

ఏప్రిల్‌ 20న నిర్వహించిన మన్‌కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ మిగతా పరిస్దితులను కూడా దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ను చివరి ఆప్షన్‌గానే ఎంచుకుంటామన్నారు. కానీ ఆ తర్వాత పరిస్ధితి మరింత విషమించింది. ఇప్పుడు దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 4 లక్షలకు చేరిపోయింది. మరణాలు కూడా 3500 దాటిపోతున్నాయి. దీంతో లాక్‌డౌన్ విధింపుపై కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది.

English summary
Rigorous national lockdown seems to be the only way to break the chain of the devastating second wave of coronavirus in the country. Experts, both in the national covid-19 task force and otherwise, have rooted for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X