తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..!
తమిళనాడు (tamil nadu), పశ్చిమ బెంగాల్లో (west bengal) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు సహా అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఎన్నికల వేళ విపక్ష ఎంపీలు లేకుండా పార్లమెంట్ ఎలా నడుపుతారని విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి చిదంబరం (chidambaram)కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు. ఏప్రిల్ 16-18 తేదీలలో పార్లమెంటును సమావేశపరచాలన్న ప్రతిపాదన దురుద్దేశపూరితమైనదని, దీనిని తప్పక వ్యతిరేకించాలని చిదంబరం పిలుపునిచ్చారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఏప్రిల్ 23న (పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 29న రెండోదశ) పోలింగ్ జరగనుంది.

The proposal to convene Parliament on April 16-18 is mischievous and must be opposed
— P. Chidambaram (@PChidambaram_IN) April 5, 2026
Polling in Tamil Nadu and West Bengal are scheduled on April 23 (and April 29 in WB)
39 MPs of TN and 28 MPs of WB are in the Opposition benches in the Lok Sabha. They will be fully engaged in…
లోక్‌సభలో ప్రతిపక్ష బెంచీలలో తమిళనాడుకు చెందిన 39 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 28 మంది ఎంపీలు ఉన్నారని, ఏప్రిల్ 16-18 తేదీలలో వారు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారని చిదంబరం గుర్తుచేశారు. ఆ తేదీలలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను చర్చకు, ఓటింగ్‌కు తీసుకువస్తే, లోక్‌సభలోని ఈ 67 మంది ఎంపీలు ఎలా పాల్గొని ఓటు వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎంపీలను మినహాయించడమే దీని వెనుక ఉన్న కుట్ర అని తాను అనుమానిస్తున్నట్లు చిదంబరం తెలిపారు.
-
ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..! -
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!! -
తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యం -
విజయ్ మనసులో బీజేపీ ఉంది.. జరిగేది ఇదే: ఎన్నికల వేళ కుష్బూ సంచలనం -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!













Click it and Unblock the Notifications