ఇదే మంచి సమయం, భారత్‌కు రండి, ఇన్వెస్ట్ చేయండి: బ్యాంకాక్‌లో మోడీ పిలుపు
బ్యాంకాక్: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సులభతర వాణిజ్యంలో భారత్ సత్తా చాటిందని అన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
భారత వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారిని ఆహ్వానించడానికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. సులభతర వాణిజ్యానికి, నివాసానికి, విదేశీ పెట్టుబడులకు, ఉత్పాదకతకు భారత్ పెట్టింది పేరు అని వ్యాఖ్యానించారు. సులభతర వాణిజ్యంలో మా దేశ ర్యాంకు మెరుగుపడినప్పుడే అక్కడ మేం కల్పిస్తున్న సదుపాయాలేంటో తెలిసే ఉంటుందని అన్నారు.
మౌలికరంగం కూడా గణనీయంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. పన్ను రేట్లు తగ్గించడంతోపాటు అవినీతికి స్థానం లేకుండా చేస్తున్నామని తెలిపారు. భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమని ఆయన చెప్పారు.

నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ లావాదేవీలు వంటి మెరుగైన ఆర్థిక సంస్కరణలు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. కార్పొరేట్ పన్ను కూడా తగ్గించామని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్లకు చేర్చడానికి ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని నరేంద్ర మోడీ తెలిపారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం థాయ్‌లాండ్ చేరుకున్నారు. ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియాన్ నేషన్స్(ఏషియాన్)-ఇండియా,
ఈస్ట్ ఏషియా అండ్ రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్(ఆర్సీఈపీ) సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. 16వ ఏషియాన్-ఇండియా సమ్మిట్, 14వ ఈస్ట్ ఏషియా సమ్మిట్, మూడోది నేగోషియబుల్ ది ట్రేడ్ డీల్.. ఆర్సీఈపీలో పాల్గొననున్నారు.
ఆదివారం వ్యాపార కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓ చాను కలిశారు మోడీ. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడం, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ఈ ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!