వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌ భేటీ-కీలక చర్చలు- తమిళనాడులో గెలిచాక తొలిసారి

|
Google Oneindia TeluguNews

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి విజయం తర్వాత తొలిసారి డీఎంకే ఛీఫ్‌ ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి దుర్గావతి స్టాలిన్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌కు వచ్చిన స్టాలిన్ దంపతులు సోనియా, రాహుల్‌తో కాసేపు చర్చించి వెళ్లిపోయారు.

తమిళనాడు ఎన్నికల్లో యూపీఏ కూటమి తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌-డీఎంకే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనంతరం తమిళనాడులోనూ ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. దీంతో తమిళనాడు విజయం తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన సీఎం స్టాలిన్ సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. నిన్న ప్రధాని మోడీని కలిసిన స్టాలిన్‌, ఇవాళ సోనియా, రాహుల్‌తో మర్యాదపూర్వకంగాభేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి భేటీలో ఏం చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు.

dmk chief stalin met sonia gandhi and rahul in delhi, first time after victory in tamil polls

తమిళనాడు ఎన్నికల్లో విజయం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంగా పదవి చేపట్టిన తర్వాత తన పనితీరుతో మంచి మార్కులు సంపాదించిన స్టాలిన్.. రాష్ట్రంలో యూపిఏ కూటమిని బలోపేతం చేయడంపై కాంగ్రెస్‌ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వం, యూపీఏ పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. స్టాలిన్ దంపతులతో సమావేశంపై రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. తమిళనాడును ఓ బలమైన రాష్ట్రంగా మార్చేందుకు స్టాలిన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Recommended Video

Kim Jong Un: ఆకలితో అలమటించే.. North Korea Food Shortage ఆహార సంక్షోభం!! || Oneindia Telugu

English summary
dmk chief and tamilnadu chief minister mk stalin on today met congress party president sonia gandhi and her son rahul gandhi in their residence at new delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X