ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: రోగులు సేఫ్, ఎక్కడ అంటే.?
కోల్ కతాలో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఎస్ కేఎం ఆస్పత్రి రెండో ప్లోర్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 9 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి.

మంటల్లో రోగులు ఎవరు చిక్కుకోలేదని తెలిసింది. ఎవరూ గాయపడలేదని అధికారులు వివరిచింది. రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి మంటలు వ్యాపించాయి. సీటీ స్కాన్ గది నుంచి ఎక్స్ రే రూమ్‌కు మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పొగ కమ్ముకుని ఉంది. స్కానింగ్ మిషన్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications