వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లిన మమతాబెనర్జీ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మానత్వాన్ని చాటుకున్నారు. సీఎం మమతా బెనర్జీ మాత్రం తన కాన్వాయ్‌లో వెళుతున్న సమయంలో ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి కనిపించాడు. దీంతో వెంటనే స్పందించిన మమతా.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కోల్‌కతాలో ప్రసేన్‌జిత్‌ కుందు(28) అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనకనుంచి ట్యాక్సీ ఢీ కొట్టింది. దీంతో అతడు రోడ్డు మీద పడిపోయాడు.

Mamata Banerjee helps out injured accident victim

అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మమతా బెనర్జీ వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో గాయపడిన యువకుడిని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ట్యాక్సీ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స తర్వాత కుందును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

కాగా, బాధితుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞలు చెప్పుకున్నాడు. ఇలాంటి మంచి పని చేసిన తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రశంసలు కురిపించారు.

English summary
In a humanitarian gesture, West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday took a youth, injured in road accident, in her convoy vehicle after stopping the fleet and making arrangement to rush him to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X