అతని నాల్గో భార్య మూడో భార్యకు నిప్పు పెట్టింది
భోపాల్: ఓ వ్యక్తి నాలుగో భార్య అతని మూడో భార్యకు నిప్పంటించింది. తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహించి ఆ దారుణానికి ఒడిగట్టింది. ఆమె విడాకులు ఇస్తే తాను అతనితో కలిసి ఉంటాననే ఉద్దేశంతో ఆ పనిచేసింది.
నిషాత్‌పుర పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అయేషా, ఆమె తల్లి వాసిమాలుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలిని షబ్నంగా గుర్తించారు.

షబ్నం ఒంటిపై అయేషా, ఆమె తల్లి వాసిమా కిరోసిన్ పోసి నిప్పంటించారు. షహ్నం వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకున్నారు.
షబ్నం సలీం అనే వ్యక్తి మూడో భార్య కాగ, అయేషా నాలుగో భార్య. నాలుగో భార్య మూడో భార్యకు నిప్పంటించిన సంఘటన జనవరి 4వ తేదీన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications