వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

PIC Talk:విమానంలో ప్రధాని మోదీ ఏంటది.. ఆ ఫోటో యమ వైరల్- రాహుల్‌తో కంపేర్..!

|
Google Oneindia TeluguNews

నరేంద్ర మోదీ.. ఈ పేరులోనే ఏదో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందుకే అఖండ భారత దేశానికి రెండో సారి ప్రధాని అయ్యారు. ప్రధాని మోదీ ఒక కార్యం తలపెట్టారంటే దానికోసం ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడపడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడగు వేయలేదు. అంతేకాదు దేశ భద్రత విషయానికొస్తే ఎక్కడా రాజీపడలేదు. శతృవులు మనదేశంపై దాడి చేస్తే సమయం చూసి మరీ పంజా విసిరారు తప్పితే ఎక్కడా వెనకడుగువేయలేదు. ఈ క్రమంలోనే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది.. తీసుకున్నారు కూడా. ఇవన్నీ జరుగుతున్నాయంటే అందుకు కారణం మోదీ నిరంతరం దేశం గురించి ఆలోచిస్తూ కష్టపడుతున్నారనేది చాలామంది చెబుతుంటారు. తాజాగా అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విటర్‌లో ఓ ఫోటోను పోస్టు చేశారు. ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపించడంతో పాటు మంచి ఆరోగ్యవంతమైన చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఆ ఫోటో ఏమిటి..?

 అమెరికా పర్యటనలో మోదీ

అమెరికా పర్యటనలో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. భారతకాలమాన ప్రకారం ఆయన గురువారం తెల్లవారు జామున అమెరికాలో అడుగుపెట్టారు. ఎయిర్ ఇండియా వన్ విమానంలో ప్రయాణం చేశారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు తీరిక లేకుండా పలు సమావేశాలకు హాజరవుతారు. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన ప్రిపేర్ అయ్యారు కూడా. మోదీ మరో దేశానికి వెళుతున్నప్పటికీ కొన్ని చేయాల్సిన పనులు మాత్రం పూర్తి చేస్తారు. ఇందుకు నిదర్శనం ఆయన విమానంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా పలు ఫైళ్లను తిరిగేస్తారు. ఎవరికేం తెలుసు... ఫైళ్లను చూడటం ఆలస్యమైతే కొంత మేర నష్టం జరగొచ్చనే భావన మోదీకి ఉంటుందని ఆయన దగ్గర పనిచేసే అధికారులు చెబుతుంటారు. అందుకే విమానంలో ఉన్నా... ప్రధాని కార్యాలయంలో ఉన్నా.. ఆయన అధికారిక నివాసంలో ఉన్నా ఎక్కడున్నా సరే.. జరగాల్సిన పనికి మాత్రం ప్రధాని మోదీ బ్రేక్ వేయరట.

 విమానంలో మోదీ ఏం చేస్తున్నారంటే

విమానంలో మోదీ ఏం చేస్తున్నారంటే

తాజాగా ప్రధాని మోదీ ఓ ఫోటోను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ ఫోటోను చాలామంది బీజేపీ నేతలు రీట్వీట్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోలో ప్రధాని తన అధికారిక విమానమైన ఎయిర్‌ ఇండియా వన్‌లో అమెరికాకు ప్రయాణిస్తున్నారు. ప్రయాణంలో కూడా ఆయన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సుదూరా ప్రయాణం చేసేప్పుడు కొన్ని ఫైళ్లను సమీక్షించేందుకు సమయం దొరుకుతుంది అదే సమయంలో అది మంచి అవకాశం కూడా అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అవును ఫ్లయిట్‌లో కూర్చుని ఏదో రిలాక్స్ అవ్వాల్సిన ప్రధాని మోదీ అలా చేయకుండా విమానంలో కూడా ఏవో ముఖ్యమైన ఫైల్స్‌ను సమీక్ష చేశారు.

 సేవా సమర్పణ్ అంటూ..

సేవా సమర్పణ్ అంటూ..

ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు వావ్ మోదీ అని ప్రశంసిస్తున్నారు. పనిపట్ల ఆయనకున్న శ్రద్ధ అంకిత భావంకు ముగ్ధులయ్యారు. ఈ ఫోటోను చాలామంది బీజేపీ నాయకులు రీట్వీట్ చేశారు. నిత్యం ప్రజల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారంటూ పోస్టింగులు రాసుకొచ్చారు. అలుపెరుగని యోధుడు మన ప్రధాని మోదీ ఎప్పుడు దేశ సేవకే అంకితమైన వ్యక్తి అంటూ రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. #sevasamarpanఅనే హ్యాష్‌ ట్యాగ్ ఇచ్చారు.

లాల్ బహదూర్ శాస్త్రి కూడా...

మరో బీజేపీ నేత కపిల్ మిశ్రా మోదీ విమానంలో ఫైల్స్ సమీక్షిస్తున్న ఫోటో పక్కన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా నాడు విమాన ప్రయాణం చేస్తే ఫైల్స్‌ను సమీక్షిస్తున్న ఫోటోను అటాచ్ చేసి ట్వీట్ చేశారు. ఇరు నేతలు వారి పనిపట్ల ఎంతో అంకితభావం కలిగి ఉన్నారంటూ పోస్టు రాసుకొచ్చారు.

మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ

మరికొందరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫోటోను కూడా రిప్లయ్‌గా పెట్టారు. రాహుల్ గాంధీ తాను ప్రయాణిస్తున్న విమానంలో ఏదో తింటున్న ఫోటోను పెట్టి క్యాప్షన్ మీరే ఇవ్వండంటూ నెటిజెన్లకు వదిలేశారు. ప్రస్తుతం ఈ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Recommended Video

విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!
 మోదీకి భారతీయ సమాజం ఘనస్వాగతం

మోదీకి భారతీయ సమాజం ఘనస్వాగతం

ఇక అమెరికా గడ్డపై అడుగిడిన ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. కొందరు మోదీ పేరును నినదించగా మరికొందరు భారత జెండాను ఎగురవేశారు. అదే సమయంలో తేలిక పాటి వర్షం కురిసింది. ప్రధాని మోదీ ఓ గొడుగు పట్టుకుని విమానం నుంచి బయటకు దిగారు. ముందుగా అధికారులు ఆయనకు స్వాగతం పలికాక... మోదీ నేరుగా అమెరికాలోని భారతీయుల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ... అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భారత్‌కు ఎంతో బలం అని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత కమ్యూనిటీకి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా క్వాడ్ సమావేశం, ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం, అమెరికాలోని టాప్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. ఇందులో యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ కూడా ఉన్నారు. ఇక మూడురోజుల పాటు అమెరికాలో బిజీ బిజీగా గడపనున్న ప్రధాని మోదీ తిరిగి ఆదివారం బయలుదేరి భారత్‌కు చేరుకుంటారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యాక... అమెరికా పర్యటనకు రావడం మోదీకి ఇది 7వ సారి.

English summary
PM Modi tweets a photo while he was reviewing some files as he travels to US in AirIndia one VVIP flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X