రైళ్లలో నో మసాజ్ .. ప్రతిపాదనపై వెనక్కితగ్గిన రైల్వేశాఖ .. కారణమిదే ..?
న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థ మసాజ్ ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటా బయట విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. రైళ్లలో ప్రయాణికుల మసాజ్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను వెనక్కితీసుకుంటున్నట్టు శనివారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదాయం కోసం ..
ప్రయాణికుల కోసం కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా మసాజ్ ప్రవేశపెడతామని ఈ నెల 8న రైల్వేశాఖ తెలిపింది. కొన్నిరోజుల్లో ఇండోర్ నుంచి బయల్దేరే 39 రైళ్లలో ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ సిబ్బంది ప్రయాణికులకు తల, మెడ, కాళ్లకు మసాజ్ చేస్తారని పేర్కొన్నది. దీంతో ఈశ్చిమ రైల్వేకు అదనంగా రూ.20 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. అంతేకాదు టికెట్ల అదనంగా బుక్ చేసుకునేవారితో రైల్వేకు రూ.90 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దాదాపు 20 వేల అదనంగా టికెట్లు కొను202గోలు చేస్తారని లెక్కట్టింది.
విమర్శలతో ..
కానీ రైళ్లలో మసాజ్ ప్రవేశపెట్టడాన్ని సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్ాచయి. ఇండోర్ ఎంపీ శంకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖకు లేఖ కూడా రాశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుధ్దమని .. అలాంటి మసాజ్ మహిళల ముందు చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రైళ్లలో ఆదాయం సమాకూర్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఓకే కానీ ... మసాజ్ మాత్రం సరికాదని సూచించారు. అంతేకాదు శతాబ్ధి, రాజధాని తప్పితే మిగతా రైళ్లలో 4 గంటల ప్రయాణం కోసం ఏ ప్రయాణికుడు మసాజ్ కావాలని కోరుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మహిళల నుంచి నిరసన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైల్వేశాఖ 3 క్యాటగిరీలుగా మసాజ్‌ను విభజించింది. గోల్డ్, డైమండ్, ప్లాటినం అని పేర్కొంది. గోల్డ్ విభాగంలో ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తారు. ఇందుకు రూ.100 చార్జీ చేస్తారు. డైమండ్ సర్వీస్‌లో రూ.200 చార్జీ చేస్తారు. ప్లాటినం ప్యాకేజీలో రూ.300 వసూల్ చేస్తారు. ఈ మూడు విభాగాల్లో ప్రయాణికులకు ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేస్తామని అంతకుముందు ప్రకటించారు. అయితే అన్నిపక్షాల నుంచి నిరసనలు రావడంతో .. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ వెనక్కి తగ్గింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications