రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన ..!!
రైతు భరోసా నిధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సంక్రాంతి సమయంలోనే ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న విడుదల కానున్నాయి. అయితే, గతంలో నిధులు జమ అయిన వారందరికీ తిరిగి ఈ సారి కూడా నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో జమ విధానం పైన స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయించింది. రేపు (ఆదివారం) సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. అయితే, రబీ సీజన్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. దీంతో ఆదివారం రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. రేపు మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది. మూడు విడతల్లో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించి నా... ఎకరం వరకు తొలి విడతలోనే అందరు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ
కాగా, 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో 'రైతు భరోసా'ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు విడతల్లోనే ఈ సారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
-
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..













Click it and Unblock the Notifications