• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్ని రాష్ట్రాల పిసీసీ ఛీఫ్ లకు కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు..! తెలంగాణ పిసీసీ లో కీలక మార్పు..?

|

ఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన దిశాగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా మెరుపులేని ఉరుము లాగా, తుపాను ముందు నిశ్శబ్దంలా కనిపిస్తోంది. దేశంలో జరగుతున్న కీలక పరిణామలు, అత్యున్నత న్యాయస్దానం తీర్పులు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తదితర అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రత్తంగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా దేశ పరిణామాల పట్ల కాకుండా ప్రాంతీయంగా పార్టీ పటిష్టత ఎలా ఉందొ తెలుసుకునేందుకు, ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ అదిష్టానం కసరత్తు చేస్తోంది.

కాంగ్రెస్ అదిష్టానం పిలుపు..! అప్రమత్తమైన పీసిసి నేతలు..!!

కాంగ్రెస్ అదిష్టానం పిలుపు..! అప్రమత్తమైన పీసిసి నేతలు..!!

అందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి అందరు నేతలను కాకుండా పీసిసి ఛీఫ్, వర్కింగ్ ప్రసిడెంట్స్, సీఎల్పీ నేతలకు కాంగ్రెస్ అదిష్టాపం ఆహ్వానం పలికింది. ఈ నెల 16న ఢిల్లీకి రావాలని ఈ నేతలను కాంగ్రెస్ అదిష్టానం పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న అనేక పదవులను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎల్లుండి శనివారం ఏఐసిసి అద్యక్షురాలు సోనియా గాంధీతో జరగబోయే సమావేశంలో ఈ పదవుల భర్తీ పట్ల ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు..! కొత్త నాయకత్వానికి పీసిసి బాద్యతలు..!!

పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు..! కొత్త నాయకత్వానికి పీసిసి బాద్యతలు..!!

అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అదిష్టానం పావులు కదుపుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు తగినంత సమయం ఉండడంతో ఈ లోపు పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయడం, అందుకోసం మంచి ప్రజాధారణ ఉన్న నాయకున్ని పీసిసి అద్యక్షులుగా నియమించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లే సత్తా, సామర్థ్యం ఉన్న నేతలకే పగ్గాలు అప్పజెప్పేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. పార్టీలో నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి, నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే నేతలకే ఈ సారి అవకావాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

 రాబోవు ఎన్నికల నాటికి పార్టీ బలొపేతం..! ఇప్పటినుండే కసరత్తు చేస్తున్న సోనియా..!!

రాబోవు ఎన్నికల నాటికి పార్టీ బలొపేతం..! ఇప్పటినుండే కసరత్తు చేస్తున్న సోనియా..!!

అంతే కాకుండా పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది పక్కన పెట్టిఎంత ప్రజాధరణ ఉంది, ప్రస్తుత ప్రభుత్వాలను ఎంతవరకు ఇరుకున పెట్టే సమర్దత ఉందనే కోణాలను కూడా అదిష్టానం పరీశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలను చురుగ్గా విమర్శించడంతో పాటు యువతను ప్రభావితం చేయగలిగే నాయకత్వం కోసం సోనియా గాంధీ అన్వేషిస్తున్నట్టు సమాచారం. దీనికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా పీసిసి అధ్యక్షుడిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే తెలంగాణ కాంగ్రెస్ పీసిసి రేసులో చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పదవికోసం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

 తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు..! రేవంత్ రెడ్డికే పీసిసి పగ్గాలు...!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు..! రేవంత్ రెడ్డికే పీసిసి పగ్గాలు...!!

కాంగ్రెస్ అదిష్టానం మాత్రం ఈసారి పీసిసి బాద్యతలను ఓ యువ నేతకు అప్పగించేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలోకి ఎప్పుడిచ్చింది ముఖ్యం కాదని, పార్టీని విజయతీరాలకు నడిపిందే ముఖ్యమని అదిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీ మరోసారి ఓడిపోవడానికి వీల్లేదని, అధికార పార్టీ వివానాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధవంతంగా తిప్పికొట్టగల నేతకే పీసిసి పగ్గాలు ఇవ్వాలని సోనియా గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం చేజిక్కించుకున్న తర్వాత అసంతృప్తులను వివిధ పదవులతొ సంతృప్తిపరచొచ్చనేది అధిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. అందుకోసం మల్కాజి గిరి ఎంపి రేవంత్ రెడ్డి లాంటి నేతకు తెలంగాణ బాద్యతలు అప్పజెప్పేందుకు సోనియా గాంధీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
The answer is whether the Congress's cleansing of the Telangana pcc was a step in the direction of the party high Command. The Congress is working to make changes in key positions that have always been pending.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more