గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్!
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపడానికి ఈగల్ టీమ్ శతవిధాల కృషి చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేయడంలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోర్స్ ఈగల్ గత కొన్ని రోజులుగా డ్రగ్స్ పార్టీలపైన వరుస దాడులు చేస్తోంది.
తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు
ఇటీవలే కొండాపూర్ లోని ఓ పబ్ పైన దాడి చేసిన ఈగల్ టీమ్, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన కొంతమందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం మరో రిసార్ట్ పైన ఈగల్ టీం దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని చారిత్రాత్మక తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది.

డ్రగ్స్ తనిఖీలను నిర్వహించిన ఈగల్ టీం అధికారులు
తారామతి రిసార్ట్ లో ఏర్పాటుచేసిన జాక్ అండ్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్లో భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందుకున్న ఈగల్ టీం పక్క సమాచారంతో రంగంలోకి దిగింది. బాలీవుడ్ కి చెందిన పలువురు నటులు కూడా ఆ పార్టీలో పాల్గొనగా ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ తనిఖీలను నిర్వహించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్
రిసార్ట్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని అనుమానం వచ్చిన వారితో పాటు అక్కడికి వచ్చిన చాలామందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలను చేశారు. అయితే అత్యంత రహస్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కోసం ఈగల్ టీం, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అధికారుల సహకారాన్ని తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఇటీవల ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేసింది.
డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలపైన ఎప్పటికప్పుడు నిఘా
ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న పబ్ లు, ఫామ్ హౌస్ లు, రిసార్ట్ ల పైన ఈగల్ టీం దాడులు చేస్తోంది. డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయడంతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోంది.
డ్రగ్స్ టెస్టులలో బాలీవుడ్ సెలబ్రిటీలు
ఈ క్రమంలోనే తాజాగా తారామతి రిసార్ట్ లో నిర్వహించిన డ్రగ్స్ టెస్టులలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు గుర్తించి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిలో ఎంతమందికి డ్రగ్స్ టెస్టులలో పాజిటివ్ వచ్చింది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
విద్యార్థులకు రేవంత్ కొత్త కానుక- 24 వస్తువులతో కిట్స్, అందులో..!! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..













Click it and Unblock the Notifications