• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమర్జన్సీ మందుల డెలివరీ పేరుతో విచ్చలవిడి ప్రయాణం..! డెలివరీ బాయ్స్ తో జర భద్రం..!!

|

హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ విజృుంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఒక్కసారిగా పెరుగుతున్న పాజిటీవ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్క రోజే 75కేసులు తెరమీదకు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులు తలెత్తాయి. అలాగే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని బావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్విగ్గీ, జొమాటో సేవలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో విచ్చల విడిగా రోడ్ల మీదకు వస్తూ ఇంటింటికి తిరుగుతున్న డెలివరీ బాయ్స్ మీద దృష్టి కేంద్రీకరించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

హైదరాబాద్ డెలివరీ బాయ్ కు పాజిటివ్.. గోప్యత పాటించిన డెలివరీ ఉద్యోగి..

హైదరాబాద్ డెలివరీ బాయ్ కు పాజిటివ్.. గోప్యత పాటించిన డెలివరీ ఉద్యోగి..

తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి ఆహార పదార్ధాల డెలివరీ సేవలను నిరవధికంగా నిషేధించిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ద్వారా సదరు డెలివరీ అబ్బాయికి కరోనా పాజిటీవ్ సోకినట్టు రుజువు కావడం కలవారాన్ని రేపుతోంది. తబ్లిఘీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి నుండి ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చిన బాయ్ కీ ప్రాణాంతక వ్యాధి సోకినట్టు నిర్ధారణ అవుతోంది. డెలివరీ బాయ్ మార్చి 19న, ఆతర్వాత ఎవరెవరిని కలిసారో అనే అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా ప్రమాదకరంగా మారిన స్విగ్గీ, జొమాటో పై ఉక్కు పాదం మోపిప తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో తిరిగే బాయ్స్ పై కూడా ఓ నజర్ వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేసాడన్న అంశంపై కూపీ.. లోతుగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు..

ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేసాడన్న అంశంపై కూపీ.. లోతుగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు..

లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్నపటికి నగరంలో ఏదో ఒక మూల కరోనా పంజా విసురుతున్నట్టు నిర్ధారణ జరుగుతోంది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ముప్పై ఏళ్ళ డెలివరీ అబ్బాయికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతని 36 ఏళ్ళ సోదరుడు మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి రాగా, అతనింట్లో మొత్తం అయిదుగురికి కరోనా సోకింది. దాంతో మొత్తం కుటుంబాన్ని క్వారెంటైన్‌లో వుంచారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తితోపాటు అతని 30 ఏళ్ళ డెలివరీ ఉద్యోగం చేసే తన తమ్ముడు కూడా క్వారెంటైన్ పూర్తి చేసుకున్నాడు.కానీ అతనికి కరోనా పాజీటివ్ తేలడమే సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది.

డెలివరీ బాయ్ పాజిటీవ్ మూలాలు కూడా ఢిల్లీవే.. ఆరా తీస్తున్న నగర పోలీసులు..

డెలివరీ బాయ్ పాజిటీవ్ మూలాలు కూడా ఢిల్లీవే.. ఆరా తీస్తున్న నగర పోలీసులు..

తన అన్న తబ్లిఘీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కేవలం ఒకరోజు మార్చి 19న మాత్రమే డెలివరీ విధులు నిర్వహించినట్టు సదరు వ్యక్తి స్పష్టం చేసాడు. దాంతో ఆ ఒక్కరోజు అతను ఎవరెవరికి ఫుడ్ డెలివరీ ఇచ్చాడనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఆ ఒక్కరోజు ఎవరిని కలిశాడు..? వారు మరి ఎంత మందిని ఈ నెల రోజుల్లో కలిసి వుంటారు.? వారిలో ఎందరికి కరోనా సోకి వుండొచ్చు అనేదిపుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అదే డెలివరీ ఉద్యోగి తాను ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం రహస్యంగా వుంచడం వెనక వ్యూహాన్ని పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

డెలివరీ బాయ్స్ ను కొంత కాలం దూరం పెట్టండి.. మెడికల్ ఎమర్జెన్సీ డెలివరీ బాయ్స్ తో కూడా ప్రమాదమే..

డెలివరీ బాయ్స్ ను కొంత కాలం దూరం పెట్టండి.. మెడికల్ ఎమర్జెన్సీ డెలివరీ బాయ్స్ తో కూడా ప్రమాదమే..

ఫుడ్ డెలివరీ ఇచ్చిన అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే తాను రహస్యంగా ఉంచినట్టైతే క్షమించరాని నేరంగా పరిగణించాల్సి వుంటుంది. అంతే కాకుండా ఎమర్జెన్సీ మెడికల్ డెలివరీ బాయ్స్ పట్ల కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్డర్ డెలివరీ అంటూ కాలింగ్ బెల్ నొక్కే ఏ ఒక్క డెలివరీ బాయ్ ని నమ్మొద్దనే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు కూడా ఆన్ లైన్ బుకింగులకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. స్విగ్గీ, జొమాటో లాగే ఎమర్జెన్సీ మెడికల్ డెలివరీ వ్యవస్థను కూడా కొంత కాలం రద్దే చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నగరు ప్రజలు.

  CM KCR Hilarious Fun On Pizza || ఈ పిజ్జాలు బొజ్జాలు ఎందుకు, కాస్త పప్పు వండుకుని తింటే చాలాయే?

  English summary
  The Telangana government is planning to implement more strict lock-in sanctions as the number of cases in Telangana is on the rise. Telangana government canceled services of Swiggy and Zomato. In the same way the demand coming out from the public that the service of delivering Medical Emergency also banned from the Telangana government.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more