అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అనే స్థాయిని మర్చిపోయి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవిష్యత్ ని అగమ్యగోచరంగా చేస్తున్న అర్భకుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి కేరళలో పినరై విజయన్ గారిపైన మాట్లాడుతున్నాడని.. జాతీయ రాజకీయాల్లో ముఖ్యనేతగా ఉన్న విజయన్ గారిపై మాట్లాడే స్థాయి రేవంత్ కి లేదన్నారు.
రేవంత్ ఆ పని చేస్తే హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటా: మాజీ స్పీకర్
కేరళలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఫ్లయిట్ ఏర్పాటు చేస్తాను.., మా తెలంగాణా కి వచ్చి 6 గ్యారెంటీల అమలు చూడమంటున్నాడు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేశానని చూపిస్తే నేను హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్నారు. శాసన మండలిలో... గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ మీద చర్చ, పద్దులపై చర్చలు అత్యంత ప్రధాన అంశాలు..ఆ అంశాల మీద చర్చ సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారని ఫైర్
శాసనసభ, శాసనమండలిలో సభ్యుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలే కరువయ్యాయన్నారు. సభను సక్రమంగా నిర్వహించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు, కట్టిన తర్వాత రాష్ట్రంలో పంటల దిగుబడి ఎలా వుందో అందరికీ తెలుసు... కానీ కేంద్ర మంత్రి పార్లమెంటు లో మాట్లాడుతూ కాళేశ్వరం, లక్ష కోట్లు నీళ్ల పాలు అయ్యాయని, నెగటివ్ కామెంట్స్ చేసాడు... ఆ కేంద్ర మంత్రికి తన శాఖపై అవగాహన లేదన్నారు.
గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన మధుసూదనాచారి
నిన్న గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.. రాహుల్ గాంధీ ఆఫీస్ లో మోడీ ఫోటో పెడుతున్నారా అని కాంగ్రెస్ వారిని అడుగుతున్నానన్నారు.కడియం శ్రీ హరి ఏ పార్టీ యో, ఘన్పూర్ ప్రజల చేత రెఫరెండం పెట్టించాలి... శ్రీహరి చిల్లరగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మిగతా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో ఇలానే రెఫరెండం నిర్వహించాలనేది నా అభిప్రాయం అని పేర్కొన్నారు.
గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ పై దాడి ప్రజా స్వామ్యంపై దాడి: దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అధికార పక్షమే ప్రభుత్వ కార్యాలయాలపై దాడిని చేయించటాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాం అన్నారు.
దిక్కు తోచకనే కాంగ్రెస్ దాడులు
తెలంగాణలో పక్క రాష్ట్ర తరహా ఫ్యాక్షన్ రాజకీయాలకు, దాడులకు కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో సైతం ఈ తరహా దాడులను చూశామని, నాడు సరైన రీతిలో సమాధానం చెప్పామని అన్నారు. రానున్న రోజుల్లో సైతం సరైన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే... దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ ఇలాంటి దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.
-
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ













Click it and Unblock the Notifications