వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్ కేసు - ఆ నేత ఫాం హౌస్ లో ఆశ్రయం : నివేదిక కోరిన గవర్నర్..!!

|
Google Oneindia TeluguNews

జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటన పైన గవర్నర్ స్పందించారు. ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన పైన రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ..సీఎస్ - డీజీపీని గవర్నర్ తమిళ సై ఆదేశించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. సున్నితమైన అంశం..మైనర్లు ఉన్న కేసు కావటంతో పాటుగా.. రాజకీయ నేతల పిల్లలు ఉన్నారనే ఆరోపణల నడుమ అత్యంత జాగ్రత్తగా విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా..ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 వెలుగులోకి కొత్త అంశాలు

వెలుగులోకి కొత్త అంశాలు


నిన్న పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి ఉమర్‌ఖాన్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు... ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో మైనర్‌ నిందితుణ్ని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, ఈ కేసులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం తరువాత నిందితులు మొయినాబాద్ లోని ఒక రాజకీయ నేత ఫాం హౌస్ లో ఆశ్రయం పొందినట్లుగా గుర్తించారు.

 ఫాం హౌస్ లో కారు..వేర్వేరు ప్రాంతాలకు

ఫాం హౌస్ లో కారు..వేర్వేరు ప్రాంతాలకు


ఆ తరువాత ఫాం హౌస్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు నిందితులు పరారయ్యారు. అత్యాచారం జరిగిన సమయంలో వినియోగించిన కారును ఫాం హౌస్ వెనుక దాచి వెళ్లిపోయారు. టెంపరరీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఆ ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. కారు పైన ఉన్న ప్రభుత్వ వాహనం స్టిక్కర్ ను తొలిగించారు. దీంతో..పోలీసులు ఇప్పుడు ఆ ఫాం హౌస్ యజమానిని ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మిగతా నిందితుల వేటలో ఉన్నారు. నిందితులు గోవావైపు వెళ్లినట్టు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణ...విమర్శలు

పోలీసుల విచారణ...విమర్శలు


రాజకీయంగా ప్రభుత్వం ..పోలీసు శాఖ పైన పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ప్రభుత్వం సైతం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా.. వారెవరైనా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందేనని పోలీసు శాఖ ను ఆదేశించింది. ఇదే సమయంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారు డీజీపీకి లేఖ అందించారు. ఈ కేసు పూర్తిగా కొలిక్కి వచ్చిన తరువాత పోలీసు అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

English summary
More details and information traced by police in minor girl rape case in Jublihills, two more accused arrest. Governor order for total report in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X