• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MAA Elections 2021:విష్ణు చేతిలో అస్త్రం - అసలు టార్గెట్ వారిద్దరే : సంధా- సమరమా : "మా" లో వాట్ నెక్స్ట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

"మా" లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హోరా హోరీ పోరులో విష్ణు "మా" పగ్గాలు దక్కించుకున్నారు. అయితే, ఆ వెంటనే మెగా బ్రదర్ నాగబాబు..తరువాత రోజు అధ్యక్ష బరిలో పోటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్ "మా" సభ్యత్వానికే రాజీనామా చేసారు. కానీ, వారిద్దరి రాజీనామాలు తాను ఆమోదించనని విష్ణు స్పష్టం చేసారు. ఇక, తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన "మా" కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసారు. దీని ద్వారా విష్ణు "మా" అధ్యక్షుడిగా ఎన్నికైతే చేస్తానని చెప్పిన పనులు పూర్తి చేయాలని..తాము అడ్డుపడబోమని రాజీనామా చేసిన సభ్యులు స్పష్టం చేసారు.

టార్గెట్ మోహన్ బాబు - నరేశ్

టార్గెట్ మోహన్ బాబు - నరేశ్

అయితే, వారు ఎక్కడా విష్ణు పైన వ్యతిరేకత ప్రదర్శించలేదు. పోలింగ్ రోజున మోహన్ బాబు...తొలి నుంచి నరేశ్ మీదనే వారి ఆగ్రహం-ఆవేదన కనిపించాయి. అయితే, ఇప్పుడు విష్ణు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గ సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అనేది చర్చకు కారణమైంది. వారు విష్ణు కోర్టులోకి బాల్ నెట్టేసారు. అయితే, ప్రకాశ్ రాజ్ తాను "మా" సభ్యత్వానికి రాజీనామా చేసినా.. విష్ణు ఆమోదించనని చెబుతున్నారంటూ..తాను రాజీనామా విత్ డ్రా చేసుకోవాలంటే ఒక కండీషన్ పెట్టారు.

ఉపంహరణకు ప్రకాశ్ రాజ్ కండీషన్

ఉపంహరణకు ప్రకాశ్ రాజ్ కండీషన్

తెలుగు వారు మాత్రమే పోటీ చేయాలనే విధంగా "మా" బైలాస్ ను మారుస్తామనే విష్ణు నిర్ణయాత్రి మార్చుకుంటే తాను "మా" సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేసారు. ఇది ప్రకాశ్ రాజ్ తన భవిష్యత్ పోటీకి అనుకూలంగా రూట్ క్లియర్ చేసుకోవటంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కార్యవర్గ సభ్యులు రాజీనామా చేస్తే..విష్ణు అండ్ మద్దతు దారులుగా నిలిచిన పెద్దలకు జరిగే నష్టం ఏంటనే చర్చ మొదలైంది. విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అధ్యక్షుడిగా విష్ణు చేతిలో అధికారం

అధ్యక్షుడిగా విష్ణు చేతిలో అధికారం

సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడిగా ఉంటుంది. 'మా' బైలాస్‌ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్‌ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్‌ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

విష్ణు సమర్ధతకు పరీక్షగా రాజీనామాలు

విష్ణు సమర్ధతకు పరీక్షగా రాజీనామాలు

ముందుగా విష్ణు వారిని రాజీనామాలు విత్ డ్రా చేసుకోమని కోరటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ డిమాండ్ మేరకు బైలాస్ మార్పు విషయంలోనూ తన నిర్ణయాన్ని మార్చుకొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక, ప్రకాశ్ రాజ్ దీంతో తన రాజీనామా విత్ డ్రా చేసుకుంటే... ఇప్పుడు ఆయన ప్యానెల్ నుంచి రాజీనామా చేసిన వారి విషయంలోనూ విష్ణు నుంచి ఒక స్పష్టత వస్తే విత్ డ్రా చేసుకొనే అవకాశం లేకపోలేదనే చర్చ సైతం నడుస్తోంది. సభ్యులుగా ఉన్న వారు ఖచ్చితంగా మేనిఫెస్టో అమలు కోసం తనను ప్రశ్నించే అధికారం ఉంటుందని..ఆ స్వేచ్చ ఖచ్చింగా ఉంటుందని విష్ణు ఓపెన్ గా చెబితే..మరి సభ్యులు మాత్రం రాజీనామాలు ఉప సంహరించుకోవటం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విష్ణు సంధా..సమరమా ఏది ఎంచుకుంటారు

విష్ణు సంధా..సమరమా ఏది ఎంచుకుంటారు

అదే సమయంలో మోహన్ బాబు వ్యవహరించిన తీరు పైన ప్రకాశ్ రాజ్ టీం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి ఖచ్చితంగా వారికి ఇండస్ట్రీలో మద్దతు లభిస్తుంది. అదే సమయంలో విష్ణు సైతం తన ఇమేజ్ పెంచుకొనేలా ఒకడుగు వెనక్కు తగ్గి వారిని బుజ్జగించటం ద్వారా ఇష్యూకు ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో నరేశ్ పాత్ర గురించి విష్ణు ఓపెన్ గా క్లారిటీ ఇవ్వగలిగితే సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని చెబుతున్నారు. దీంతో..నరేశ్ భవిష్యత్ పాత్ర పైన విష్ణు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి జరిగితే..ఇక, వారు రాజీనామాల ఉప సంహరణ పెద్ద సమస్యే కాదనేది ఇండస్ట్రీ లో జరుగుతున్న చర్చ. ఇవన్నీ కూడా వర్కవుట్ కాకుంటే..ఇక, విష్ణు వారి స్థానంలో కొత్త వారిని నియమించుకొనే అధికారం ఎలాగూ ఉంటుంది.

Recommended Video

MAA Elections: MAA Elections 2021 Results | Oneindia Telugu

"మా" పరిణామలపై ఉత్కంఠ

అదే జరిగితే..రెండేళ్ల పాటు విష్ణు పూర్తిగా అధ్యక్షుడి హోదాలో పని చేస్తూ..తన మేనిఫెస్టో అమలు చేయగలిగితే..ఇక భవిష్యత్ లోనూ ఇబ్బందులు ఉండవని ఆయన మద్దతు దారులు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు విష్ణు రాజీనామా చేసిన సభ్యులకు ఎటువంటి ఆఫర్ ఇస్తారు..వారు విష్ణు మాటను ఫాలో అవుతారా..లేక, సమరానికే సై అంటారా..తరువాతి పరిణామలు ఏంటనే అంశం పైన ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటుగా సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

English summary
With Prakash Raj team resignations for the MAA membership, President Vishnu has got the boon to select his own persons for the vacated posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X