Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క!

తెలంగాణా మంత్రి సీతక్క మహిళలకు మరో శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఊహించని విధంగా ఆర్ధిక భరోసా అందిస్తున్నట్టు చెప్పారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ అర్ధమయ్యేలా వివరించారు.

మహిళల కోసం వడ్డీ లేని రుణాలు : సీతక్క
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా సంఘాలలో చేరిన ప్రతి మహిళకు ఉచిత రుణాలను ఇస్తుందని, వారితో చిన్న మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులను కూడా వారికి కేటాయించినట్లు మంత్రి సీతక్క గుర్తు చేశారు.

Minister Seethakka gave amazing good news for dwcra women

మహిళా సంఘాలను బలోపేతం చేసేలా కృషి
మహిళా సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా తాము పని చేస్తున్నట్టు వెల్లడించారు. రవాణా రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్న సీతక్క, రవాణా రంగంలో కూడా మహిళలకు ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు లభిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కులమత ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయదని, అభివృద్ధి అజెండా తోనే ముందుకు సాగుతుందని సీతక్క పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాధాన్యత నిస్తుందని పేర్కొన్న సీతక్క ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి రంగంలోనూ మహిళలకు సమానమైన ప్రాధాన్యత నివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరికీ మేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నాయక్ ను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో గతంలో బీఆర్ఎస్ మూడుసార్లు గెలిచినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదన్నారు. కనుక ప్రజలు ఆచి తూచి అలోచించి నిర్ణయం తీసుకోవాలని సీతక్క కోరారు. మహిళలకు, మైనార్టీలకు, బీసీలకు అందరికీ మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+