మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం: పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ను పోలీసులు సీజ్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్టు రెవిన్యూ అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ కేసు విచారిస్తున్న సిట్
రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా ఈ చర్య చేపట్టినట్టు, ఫామ్ హౌస్ ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి హాజరైన వారి వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది.

టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు, ఏలూరు టిడిపి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఈ కేసు పైన అందరికీ ఆసక్తి నెలకొంది. పుట్టా మహేష్ కుమార్ కి కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది.
డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎంపీగా ఉన్న ఆయన స్టేషన్ బెయిల్ తీసుకొని విడుదలయ్యారు. ఇక ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ను తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు? వంటి అన్ని వివరాలను సిట్ అధికారులు రాబడుతున్నారు.
కేసులో పరిణామాలపై ఉత్కంఠ
ఈ కేసులో నిందితుడైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డ్రగ్స్ తీసుకుని వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో అభిషేక్ సింగ్ అరెస్టుతో మరింత లోతైన వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్ ఆధ్వర్యంలో ఉన్న ఈ కేసులో దర్యాప్తులో ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.
-
నటి హేమ పబ్ వీడియో వైరల్.. నేనెప్పుడూ తప్పు చేయనంటూ..! -
మూతపడిన మీ-సేవా, వెబ్సైట్ షట్‌డౌన్. ఏం జరుగుతుంది? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది













Click it and Unblock the Notifications