వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు బై పోల్ ఎప్పుడు - నేడే క్లారిటీ : ఇక మొదలు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు కీలకంగా మారింది. మునుగోడు బై పోల్ రానున్న ఎన్నికలకు సెమీస్ గా మారుతోంది. దీంతో..ఉప ఎన్నిక ఎప్పుడు జరగనుంది. ఈ విషయం పైన ఈ రోజేనే క్లారిటీ రానుంది. కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసారు. నవంబర్ లో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మునుగోడు బై పోల్ జరుగుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఇదంతా జరగాలంటే ఇక్కడ స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది.

స్పీకర్ తో రాజగోపాల్ సమావేశం

స్పీకర్ తో రాజగోపాల్ సమావేశం

రాజగోపాల్ రాజీనామా ప్రకటించిన తరువాత స్పీకర్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. ఆయన అందుబాటలో లేరు. ఈ రోజు స్పీకర్ ను కలవాలని రాజగోపాల్ నిర్ణయించారు. చేయనున్నారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయనున్నారు. రాజగోపాల్ వ్యక్తిగతంగా రాజీనామా లేఖను అందించి..వెంటనే ఆమోదించాలని కోరనున్నారు. దీని పైన స్పీకర్ నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది. స్పీకర్ తనకు రాజీనామా అందగానే వెంటనే ఆమోదించి.. మునుగోడు సీటు ఖాళీ అయినట్లుగా నోటీఫూ చేస్తే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మరో 15 -16 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముందస్తు ఎన్నికల పైనా ప్రచారం సాగుతోంది.

స్పీకర్ నిర్ణయం పైనే ఉత్కంఠ

స్పీకర్ నిర్ణయం పైనే ఉత్కంఠ

ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో స్పీకర్ కు సంబంధం లేకపోయినా.. సాధారణ ఎన్నికలకు ఉన్న గడువును పరిగణలోకి తీసుకొని..దీని పైన న్యాయ సలహా మేరకు స్పీకర్ ముందుకెళ్తారనే అభిప్రాయం కొందరు విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. కానీ, అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పీకర్ రాజీనామా ఆమోదం పైన ఆలస్యం చేసే అవకాశం ఉండదని.. వెంటనే ఆమోదించే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అదే జరిగితే..ఇక, మునుగోడు అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయంగా మరోసారి హోరా హోరీగా రాజకీయ వ్యూహాలు మొదలవుతాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ పోటీ చేయనుండటంతో.. కాంగ్రెస్ - టీఆర్ఎస్ నుంచి అభ్యర్ధుల ఎంపిక జరగాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కోమటిరెడ్డి కి వ్యక్తిగతంగా ఉన్న పట్టుతో మునుగోడు ఇప్పటి వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. రాజగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ వీడి బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో.. కాంగ్రెస్ ఓట్లు - రాజగోపాల్ ఓట్లుగా చీలక వస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది.

ఆమోదిస్తారా - పెండింగ్ పెడతారా

ఆమోదిస్తారా - పెండింగ్ పెడతారా

బీజేపీ వైపు ఓటర్లు ఏ శాతం మేర మొగ్గుతారనేది కీలకంగా మారుతోంది. రాజగోపాల్ కు మద్దతుగా కాంగ్రెస్ నుంచి ఏ స్థాయిలో నిలబడతారనేది ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. ఈ లెక్కలతో కాంగ్రెస్ - టీఆర్ఎస్ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని తమ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో గెలిచి వచ్చే ఎన్నికల ముందు తమ శక్తి చాటాలని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ బయట పడకపోయినా..అంతర్గతంగా బై పోల్ పైన కసరత్తు ప్రారంభించింది. ఇక, మునుగోడు బై పోల్ రేవంత్ కు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారుతోంది. దీంతో..నేడు రాజగోపాల్ తన రాజీనామా లేఖ స్పీకర్ కు అందించిన తరువాత.. సభాపతి తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కనిపిస్తోంది.

English summary
Komati Reddy Rajagopal Reddy himself submit his letter to the Assembly Speaker to accept the resignation on Monday. Speaker Decision becoming crucial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X