వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-తెలంగాణా మధ్య కొత్త రగడ: బోర్డర్ లో ఏపీ ధాన్యం లారీలకు బ్రేక్ ; ఏపీ రైతులకు షాక్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్న ధాన్యం లారీలను తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే వాటిని ఆపేస్తున్నారు. దీంతో ఏపీ నుండి ధాన్యం తరలిస్తున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ రవాణా అడ్డుకున్నారంటూ ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం లారీలను అడ్డుకుంటున్నారు అని చర్చిస్తున్నారు.

తెలంగాణాలో సాగుతున్న ధాన్యం కొనుగోళ్ళ రగడ

తెలంగాణాలో సాగుతున్న ధాన్యం కొనుగోళ్ళ రగడ

తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలం నుండి ధాన్యం కొనుగోళ్ళ రగడ కొనసాగుతుంది. తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్న సాకుతో, తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుంది. తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోలు రగడ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో సాగు చేసిన రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పిన తెలంగాణ సర్కారు, ఇంకా రైతుల వద్ద నుండి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇప్పటికీ కల్లాల వద్ద రైతులు ధాన్యం కొనుగోలు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీ నుండి తెలంగాణాకు వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకుంటున్న తెలంగాణా అధికారులు

ఏపీ నుండి తెలంగాణాకు వస్తున్న ధాన్యం లారీలను అడ్డుకుంటున్న తెలంగాణా అధికారులు

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధాన్యం సమస్య పరిష్కారం కాకుండా ఏపీ నుండి ధాన్యం తెలంగాణ రాష్ట్రానికి రావడంపై సర్కార్ సడన్ గా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకుంటుంది. ఏపీ సరిహద్దులో తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకు వెళ్తున్న ధాన్యం లారీలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం లారీలను అనుమతించేది లేదని తెలంగాణ పోలీసులు తేల్చి చెబుతున్నారు.

పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర నిలిచిపోయిన ధాన్యం లారీలు

పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర నిలిచిపోయిన ధాన్యం లారీలు


జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ తనిఖీ కేంద్రం వద్ద పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న 16 ధాన్యం లారీలను అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా ధాన్యం రాకుండా ఉన్నతాధికారులు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. దీంతో ధాన్యం లారీలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది.

అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా సరే లారీల అడ్డగింత

అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా సరే లారీల అడ్డగింత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చే ధాన్యాన్ని అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న ఆంధ్రా రైతులు లబోదిబోమంటున్నారు. చట్ట ప్రకారమే ఆంధ్రా నుంచి తెలంగాణకు ధాన్యాన్ని తీసుకొస్తున్నామని, అయితే అకారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వే బిల్లులు తోపాటు అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ సరైన కారణం చెప్పకుండా ధాన్యం లారీలను అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా సర్కార్ తీరుపై ఏపీ రైతుల అసహనం

తెలంగాణా సర్కార్ తీరుపై ఏపీ రైతుల అసహనం

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ధాన్యాన్ని తాము నిల్వ చేసే పరిస్థితి లేదని, వాహనంలో లోడ్ ఎత్తిన ధాన్యాన్ని తిరిగి తీసుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఏపీలో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యొద్దని నిర్ణయిస్తే, అది ముందే చెప్పాల్సి ఉంటుందని, తీరా ఇప్పుడు ధాన్యం లారీలను అడ్డు కోవడం ఏవిధంగా కరెక్ట్ అని ఆంధ్ర ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ ధాన్యం కొనాలంటే తెలంగాణా వ్యాపారులకు షాక్ ..

ఏపీ ధాన్యం కొనాలంటే తెలంగాణా వ్యాపారులకు షాక్ ..

ఇక ఏపీ నుండి కొనుగోలు చేసినా సరే ఆ ధాన్యాన్ని, తెలంగాణలోకి రానివ్వకపోవడంతో అక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే తెలంగాణ వ్యాపారులు భయపడుతున్నారు. ఒకవేళ కొనుగోలు చేస్తే తర్వాత తాము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అన్న సంశయంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ నుండి వచ్చే ధాన్యాన్ని ఏవిధంగా తీసుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొదట తెలంగాణ రైతులు సాగుచేసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. వడ్లు కల్లాల్లో పోసుకుని ఎదురుచూస్తున్న రైతులు ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్ళపై నేడు కేంద్ర మంత్రితో ఏపీ మంత్రి భేటీ

ధాన్యం కొనుగోళ్ళపై నేడు కేంద్ర మంత్రితో ఏపీ మంత్రి భేటీ

ఇదిలా ఉంటే తెలంగాణ ధాన్యం కొనుగోలు ఈరోజు కేంద్రం క్లారిటీ ఇవ్వనుంది .తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రి తో భేటీ కానున్నారు. 2021 - 2022 ఖరీఫ్, రబీ సీజన్లో కేంద్రం కొనుగోలు చేసే ధాన్యం కోటాపై ఆయన మంత్రితో చర్చించనున్నారు. కేంద్రం ఎంత మేరకు ధాన్యం సేకరిస్తుందో చెప్తే ఆ మేరకే సాగు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణా మంత్రి భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
new problem has arisen between Andhra Pradesh and Telangana. Telangana authorities are blocking paddy lorries coming into Telangana from Andhra Pradesh. They say paddy lorries will not be allowed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X