వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డిని రాళ్ళతో కొడతారు, రేపో మాపో జైలుకు ; కేసీఆర్ ను అనే స్థాయా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో నిర్వహిస్తున్న సభలలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న రావిర్యాలలో నిర్వహించిన సభలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం మూడు మాత్రమే అడుగుతున్నారు అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కెసిఆర్ ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కెసిఆర్ ఇస్తామనే వాటికి ఆశ పడతారేమో కానీ, దళిత గిరిజనులు కాదంటూ ద్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు .సీఎం కేసీఆర్ ను దళిత గిరిజనుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇంద్రవెల్లి లో తొలి అడుగు వేశామని మలి అడుగు మహేశ్వరంలో పెట్టామని ఇక ఇంకో అడుగు కెసిఆర్ నెత్తిమీద పెడతామంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు : బేతి సుభాష్ రెడ్డి

నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు : బేతి సుభాష్ రెడ్డి

సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎదురు దాడి మొదలుపెట్టారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని చెబుతున్న రేవంత్ దేని మీద ప్రశ్నిస్తారు చెప్పాలని నిలదీశారు. వ్యవసాయానికి పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నందుకు ప్రశ్నిస్తావా ? ఫ్లోరైడ్ వాటర్ సమస్యలు తీర్చేందుకు ప్రశ్నిస్తావా ? అంటూ నిలదీశారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ధ్వజమెత్తారు.

 కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ ను రాళ్లతో కొట్టి పంపిస్తారు : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ ను రాళ్లతో కొట్టి పంపిస్తారు : మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇక టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. తమకు కూడా తిట్లపురాణం వచ్చని కానీ సంస్కారం అడ్డొస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఖబడ్దార్ రేవంత్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పాలంటూ ప్రశ్నించినా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ ను రాళ్లతో కొట్టి పంపిస్తారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ : జీవన్ రెడ్డి

చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ : జీవన్ రెడ్డి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేశారు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఎందరో ఉద్యమకారులకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన సీఎం కేసీఆర్ అని కెసిఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

రేవంత్ రేపో మాపో జైలుకు : గువ్వల బాలరాజు

రేవంత్ రేపో మాపో జైలుకు : గువ్వల బాలరాజు

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేక పోతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. దళిత బందు పై అక్కసుతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రేవంత్ రేపోమాపో జైలుకు పోక తప్పదని పేర్కొన్నారు. రేవంత్ ను నమ్ముకున్న వాళ్లు కూడా రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదని విమర్శించారు. దళిత ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిల్లర మాటలు ఆపకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని వెల్లడించారు . రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్ సభను ఆపి తీరుతామని హెచ్చరికలు జారీ చేశారు గువ్వల బాలరాజు.

రేవంత్ కు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు : ఆల వెంకట్ రెడ్డి

రేవంత్ కు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు : ఆల వెంకట్ రెడ్డి


రేవంత్ రెడ్డికి కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే ఆల వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి దానికి విపక్షాలు పనిచేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారని ఆయన దళిత బంధు లాంటి పథకాలను గుడ్డిగా విమర్శించవద్దంటూ రేవంత్ రెడ్డికి హితవుపలికారు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి పై మాటల తూటాలను పేల్చారు.

English summary
TRS party leaders have launched a counter-attack on Revanth Reddy's remarks targeting CM KCR. MLA Beti Subhash Reddy, Ala Venkat Reddy said that Revanth has no right to talk about KCR. Guwwala Balaraju said that Rewanth will go to jail. Manchireddy Kishan Reddy was angry that Congress seniors would pelt stones on revanth for sure. Jeevan Reddy flagged that Revanth is working under the direction of Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X