• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అజ్ఞాతవాసికేనా?: ఏపీలో బాలయ్య, నాగ్ సినిమాలకూ స్పెషల్ షో పర్మిషన్లిస్తారా?

  By Swetha Basvababu
  |
   అజ్ఞాతవాసి కి ప్రత్యేక షోలు : మరి జై సింహా, జై లవ కుశ కి ఎందుకు లేవు ?

   హైదరాబాద్/ అమరావతి: ఇది ఇప్పుడు అధికారికం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన మిత్రుడు పవన్ కల్యాణ్ పట్ల చాలా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ నటించి 'అజ్ఞాతవాసి' సినిమా బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్నది. బుధవారం నుంచి ఈ నెల పది వరకు రాష్ట్రమంతటా సంక్రాంతి పండుగ సందర్భంగా అర్థరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పది గంటల వరకు మూడు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
   ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్‌లో గల హారిక అండ్ హస్సిన్ క్రియేషన్స్ ప్రతినిధుల అభ్యర్థన మేరకు విజయవాడ, విశాఖ పట్నం నగరాల పరిధిలోని పలు సినిమా థియేటర్లలో ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి అనుమతులు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

   వారం 24 గంటల పాటు ఏడు షోల ప్రదర్శనకు ఇలా ఆదేశం

   వారం 24 గంటల పాటు ఏడు షోల ప్రదర్శనకు ఇలా ఆదేశం

   రోజువారీగా సినిమా షోల ప్రదర్శన విషయమై ఆంక్షలు విధిస్తూ ఏపీ సినిమా (నియంత్రణలు) రూల్స్, 1970లోని ఫాం - బీ 43 ప్రకారం మినహాయింపులు ఇస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా గల సినిమా థియేటర్లలో అజ్ఞాతవాసి సినిమాను వారం పాటు 24 గంటల పొడవునా ప్రదర్శించడానికి మినహాయింపు ఇచ్చినట్లయింది.

   ‘నైజాం’లో ఆదాయం లభించేది హైదరాబాద్‌లోనే

   ‘నైజాం’లో ఆదాయం లభించేది హైదరాబాద్‌లోనే

   తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరం ‘నైజాం'లో అతిపెద్ద ఆదాయం తెచ్చి పెట్టేది కూడా. ఇక్కడ అదనంగా ఒక సినిమా షో ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మరో రెండు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుకాడటానికి రాజకీయ అంశాలే కారణమా? అన్న అభిప్రాయం ఉన్నది. తొలుత ప్రీమియర్ షోల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడంతో.. ఎవరేం చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండబోదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం.

   వారిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగిందా?

   వారిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగిందా?

   నూతన సంవత్సరం సందర్భంగా సీఎం కే చంద్రశేఖర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రగతి భవన్‌కు వచ్చిన సినీ నటుడు పవన్ కల్యాణ్ దాదాపు గంటసేపు వేచి చూసి చర్చించడంతోపాటు విందు స్వీకరించినట్లు కూడా వార్తలొచ్చాయి. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఉప్పూనిప్పూగా వ్యవహరించిన సీఎం కేసీఆర్, సినీ నటుడు పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడుకోవడంతోనే రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అదీ ఇప్పటికిప్పుడు పూర్తిగా మారితే ఇబ్బందులు ఎదురవుతాయని సందేహాలు టీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నాయని అనిపిస్తున్నది. ఇక ఉమ్మడి హైకోర్టు ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంపు నిర్ణయం అమలులోకి వచ్చేసింది. మంగళవారం అర్థరాత్రి నుంచి ‘అజ్ఞాతవాసి' సినిమా ప్రదర్శన ప్రారంభమైంది.

   నంది అవార్డుల విషయంలోనూ ఇలా వివాదం

   నంది అవార్డుల విషయంలోనూ ఇలా వివాదం

   ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెలలో విడుదల అయ్యే సినిమాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మినహాయింపులు ఇవ్వగలరా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే తరహా మినహాయింపులతో సినీ రంగానికి ప్రయోజనం చేకూరుస్తారా? అన్న సందేహాలు ఉన్నాయి. గతంలో ‘రుద్రమదేవి' సినిమా నిర్మించిన గుణశేఖర్ రాయితీలు కల్పించాలని కోరినా చంద్రబాబు నాయుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీని కారణంగానే ఇటీవల నంది అవార్డుల ప్రదానోత్సవంలో కేవలం అల్లు అర్జున్ సహాయక పాత్ర పోషించినందుకు మాత్రమే అవార్డు ఇవ్వడంపై వివాదం హోరెత్తింది. తర్వాత అదే సర్దుమణిగింది అది వేరే సంగతి.

    థియేటర్లలోకి 14న నాగార్జున నిర్మించిన ‘రంగుల రాట్నం’

   థియేటర్లలోకి 14న నాగార్జున నిర్మించిన ‘రంగుల రాట్నం’

   ఆసక్తికరమైన విషయమేమిటంటే చంద్రబాబు నాయుడు సొంత బావ మరిది, వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రుష్ణ నటించిన ‘జై సింహా' సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నది. ఇక అక్కినేని నాగార్జున నిర్మించిన రాజ్ తరుణ్ నటించిన సినిమా రంగుల రాట్నం సినిమా కూడా జనవరి 14వ తేదీన విడుదల కాబోతున్నది. జనవరి 13వ తేదీన తమిళంలో నటించిన డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్' సినిమా థియేటర్లలోకి రానున్నది. ఈ క్రమంలో అజ్ఞాతవాసి సినిమాకు రోజంతా ఏడు షోల ప్రదర్శనకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం.. మిగతా సినిమాలకు కూడా అదే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   It is now official. The Andhra Pradesh government issued an order (Memo No. 3829/General.A/A2/2017) on Monday, accorded permissions to the managements of theatres and multiplexes to screen special shows of Agnyathavasi on the eve of Sankranti festival from January 10 to 17 between 1 am and 10 am in the entire state.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more