వివాహిత ఫేస్‌బుక్ లైవ్‌లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో తనపై అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజేంద్రనగర్‌‌లో చోటు చేసుకొంది.

ఉప్పర్‌పల్లిలో హెచ్‌ఈఆర్‌ అపార్ట్‌మెంట్‌లోని 403 ఫ్లాట్‌లో తబస్సుం (32), భర్త సలీమ్‌ ఉన్నీస్సా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఉంటున్నారు.అపార్ట్‌మెంట్‌లో కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్నా మెయింటెనెన్స్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనికితోడు గత నెలలో చార్జీలను పెంచారు. అపార్ట్‌మెంట్‌ను పాతబస్తీ డబీర్‌పురా ప్రాంతానికి చెందిన సలీమ్‌ నిర్వహిస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌ నిర్వహణ విషయమై ఈ నెల 20న తబస్సుం.. సలీమ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Woman's Selfie video before attempting suicide

ఈ విషయమై అదేరోజు సాయంత్రం సలీమ్‌.. తబస్సుంకు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. ఈ వ్యవహారాన్ని తబస్సుం సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసి 21న రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా ఇదే విషయమై పోలీసులు తబస్సుంను మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇంటికి వచ్చిన తబస్సుం ఫేస్‌బుక్‌లో సలీమ్‌ పోస్టు చేసిన అనుచిత కామెంట్లు చూసింది. దీంతో మనస్తాపం చెంది అదే ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియోలో 90 నిద్రమాత్రలు చూపుతూ మింగింది.

తనను వేధించిన సలీమ్‌ను కఠినంగా శిక్షించాలని వీడియో లైవ్‌లో తెలిపింది. ఈ వీడియోను చూసిన స్నేహితులు విషయాన్ని ఆమె భర్తకు తెలిపారు. ఆమెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడ నుంచి ఉస్మానియాకు తరలించారు.

మరో 16 గంటల పాటు ఏమి చెప్పలేని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనను సలీమ్‌ దుర్భాషలాడిన విషయాన్ని తబస్సుం ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A heinous incident has taken place in Rajendra Nagar of Hyderabad, due to which an innocent Muslim woman has attempted suicide. This woman has recorded a selfie video of her suicide attempt by consuming sleeping tablets. This woman has said that apartment Secretary Saleem is the reason for her suicide.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి