వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్ముకుంటే పైలట్ రోహిత్ రెడ్డి కొంప ముంచిన వైసీపీ ఎంపీ.. ఈడీ విచారణతో చిక్కులేనా?

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న పైలెట్ రోహిత్ రెడ్డి, ఈడీ విచారణను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. తన తరపున వాదించడానికి వైసీపీ ఎంపీ, జగన్ అక్రమాస్తుల కేసులో వాదించే లాయర్ అయిన నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. ఆయనను ఎంతో నమ్మి, బలంగా వాదించి తనను ఈడీ విచారణ నుంచి బయట పడేస్తాడు అని కేసును అప్పగించారు. అయితే కోర్టులో నిరంజన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి తరఫున బలంగా వాదించడంలో విఫలం కాగా పైలెట్ రోహిత్ రెడ్డి పరిస్థితి ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నట్లు తయారైంది.

పైలట్ రోహిత్ రెడ్డి తరపున వాదించిన లాయర్ వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి

పైలట్ రోహిత్ రెడ్డి తరపున వాదించిన లాయర్ వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను ఫిర్యాదు చేస్తే, ఈడీ అధికారులు తననే విచారిస్తున్నారు అని, ఇది చట్టవిరుద్ధమని పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఆయన తరపున వాదించడానికి వైసీపీ ఎంపీ ప్రముఖులైన నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. ఈడీ విచారణ నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ముందు వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి, హైకోర్టు తన వాదనతో ఏకీభవించేలా బలమైన వాదనలు వినిపించలేకపోయారని తెలుస్తుంది. దీంతో ఈడీ విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని రోహిత్ రెడ్డి తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

పైలట్ రోహిత్ రెడ్డి తరపు వాదనలతో ఏకీభవించని కోర్టు

పైలట్ రోహిత్ రెడ్డి తరపు వాదనలతో ఏకీభవించని కోర్టు

పార్టీ మారాలని తన క్లయింట్ పైలట్ రోహిత్ రెడ్డికి 100 కోట్లను ఆఫర్ చేశారు కానీ, డబ్బులు ఇవ్వలేదని, ఆర్థిక పరమైన లావాదేవీలు జరగలేదు కాబట్టి ఇది ఈడీ విచారణ పరిధిలోకి రాదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఈ కేసులో ఈడీ విచారణ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని వాదించినప్పటికీ హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించలేదు. ఈనెల 30వ తేదీన పైలెట్ రోహిత్ రెడ్డి హాజరుకావాలన్న ఈడీ జారీచేసిన నోటీసులపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.

పైలట్ రోహిత్ రెడ్డిని కాపాడలేకపోయిన వైసీపీ ఎంపీ.. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి

పైలట్ రోహిత్ రెడ్డిని కాపాడలేకపోయిన వైసీపీ ఎంపీ.. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి

హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో మళ్లీ పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు నందకుమార్ ను రెండు రోజులపాటు విచారణ జరిపారు. ఇక నంద కుమార్ ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డిని మరింత ఇరకాటంలో పెట్టబోతున్నారు అని బీఆర్ఎస్ నేతలలో టాక్ నడుస్తుంది. ఇక ఈ క్రమంలోనే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ విచారణ తప్పదా అని చర్చిస్తున్నారు. పాపం... బాగా నమ్ముకుంటే అడ్వకేట్, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డిని కాపాడలేకపోయారు. ఈడీ విచారణ నుండి తప్పించలేకపోయారు అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతుంది.

English summary
YSRCP MP, Advocate Niranjan Reddy, who fought in the court for pilot Rohit Reddy, could not save him from the ED investigation. Due to this, the pilot Rohit Reddy to face dificulties with the ED.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X