• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నరేంద్ర మోడీ విశాఖ పర్యటన: యూటర్న్, పుల్వామా ఘటన: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ

|

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. మోడీ పర్యటనకు రెండు రోజుల ముందు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన సానుకూలంగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు, మోడీ పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Narendra Modi Visakhapatnam tour live updates

Newest First Oldest First
8:12 PM, 1 Mar
బీజేపీని దెబ్బకొట్టేందుకు కూటములు కడుతున్నారని మండిపడ్డారు.
8:10 PM, 1 Mar
పాపాలు చేసిన వాళ్లే భయపడతారని, తాను భయపడనని మోడీ చెప్పారు. నీతి, నిజాయితీగా పని చేస్తే ఇక్కడి నేతలు భయపడాల్సినపని లేదని చెప్పారు.
8:06 PM, 1 Mar
వరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడతారో వారే నిత్యం భయపడతారని ప్రధాని మోడీ.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మాది అంతా పారదర్శక పాలన అని, అందుకే దేనికీ భయపడమని చెప్పారు. తాము అంకితభావంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడి నేతలు ప్రతిసారి యూటర్న్ తీసుకుంటున్నారని చెప్పారు. ఇక్కడి నాయకులు అనేక అవినీతి పనులు చేశారని చెప్పారు. ఇక్కడి పాలకులు కుటుంబ పాలనను వ్యవస్థీకృతం చేశారన్నారు. ఈ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మోడీని తిడుతున్నారన్నారు.
8:01 PM, 1 Mar
ఢిల్లీలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం బాగుపడుతుందన్నారు.
7:59 PM, 1 Mar
బలమైన కేంద్ర ప్రభుత్వంతోనే జవాన్లు, రైతులు బాగుంటారని చెప్పారు.
7:58 PM, 1 Mar
దేశాన్ని కించపరిచే నేతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ హెచ్చరించారు.
7:56 PM, 1 Mar
కొందరు నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఈ నేతల మాటల వల్ల సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు.
7:55 PM, 1 Mar
ఏపీ నేతలు పలుమార్లు యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు.
7:54 PM, 1 Mar
పాకిస్తాన్‌ను ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తే, ఇక్కడి నేతలు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం వారికి అండగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని మోడీ ధ్వజమెత్తారు. దేశాన్ని ఎలా కించపరుస్తున్నారో చూడాలన్నారు.
7:52 PM, 1 Mar
ఇక్కడి నేతలు ఎలాంటి వారితో కూటమి కట్టారో గ్రహించాలని మోడీ.. కాంగ్రెస్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు.
7:50 PM, 1 Mar
ఎవరైతే అవినీతి, అక్రమాలకు పాల్పడతారో వారే నిత్యం భయపడతారని ప్రధాని మోడీ.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
7:44 PM, 1 Mar
విశాఖ ఉక్కుపరిశ్రమను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. అనేక కార్యక్రమాల ద్వారా విశాఖను స్మార్ట్ సిటీగా మారుస్తున్నామని చెప్పారు.
7:42 PM, 1 Mar
దక్షిణ కోస్తా రైల్వే జోన్ బాగా అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు.
7:38 PM, 1 Mar
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల అని, దానిని ఇప్పుడు తాము ఇచ్చామన్నారు.
7:35 PM, 1 Mar
విశాఖను చూస్తే మనసు పులకరిస్తోందని, తాము ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ తెలుగులే చెప్పారు.
7:34 PM, 1 Mar
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడారు.
7:33 PM, 1 Mar
బీజేపీ సత్యమేవ జయతే పేరుతో బహిరంగ సభ నిర్వహించింది.
7:17 PM, 1 Mar
విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ఈ బహిరంగ సభ జరిగింది.
7:13 PM, 1 Mar
ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయనకు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.
6:55 PM, 1 Mar
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం చేరుకున్నారు.
6:40 PM, 1 Mar
విశాఖపట్నంలో బీజేపీ బహిరంగ సభ ప్రారంభమైంది. మరికాసేపట్లో ప్రధాని మోడీ రానున్నారు.
6:08 PM, 1 Mar
కాసేపట్లో ప్రధాని మోడీ విశాఖకు రానున్నారు.
6:07 PM, 1 Mar
ఏ ఒక్క అంశాన్ని అయినా పూర్తిగా అమలు చేశారా అంటూ యనమల నిలదీశారు. చట్టానికి తూట్లు పొడిచే అధికారం వారికెక్కడిదన్నారు. ఏపీకి నమ్మకద్రోహం చేస్తే వారికి ఏం లాభమో విశాఖలో అడుగు పెట్టేముందే ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోసానికి ప్రతిరూపం, నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం మోడీ అన్నారు.
6:06 PM, 1 Mar
పదేళ్లలో విభజన చట్టాన్ని ఎంతవరకు అమలు చేశారని యనమల రామకృష్ణుడు తెలిపారు. దీనిపై తెలుగు జాతికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు.
5:46 PM, 1 Mar
పీకే అనే కన్సల్టెంట్‌కు వైసీపీని జగన్ అప్పగించారన్నారు. పీకే చెప్పిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పారు. ఇది జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
5:46 PM, 1 Mar
హైదరాబాద్ నుంచి వట్టి చేతులతో అమరావతికి వచ్చామన్నారు. హామీలు అమలు చేయమని అడిగితే ఈడీ చేత దాడులు చేయిస్తున్నారని మోడీపై ధ్వజమెత్తారు.
5:46 PM, 1 Mar
బాధ్యత కలిగిన వ్యక్తులు వైసీపీలో ఉండరని చంద్రబాబు చెప్పారు. రాజకీయాలతో కేసుల నుంచి బయటపడేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్ట హామీలపై కేంద్రాన్ని జగన్ ప్రశ్నించలేడన్నారు.
5:44 PM, 1 Mar
ఆదాయం వచ్చే వాల్తేరు జోన్ నుంచి తప్పించి విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ప్రజలను మోసం చేసేందుకే ప్రధాని విశాఖ వస్తున్నారని చెప్పారు.
5:43 PM, 1 Mar
తెలుగు ప్రజలను మోసం చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే నల్ల చొక్కా ధరించానని చెప్పారు.
5:25 PM, 1 Mar
వట్టి చేతులతో ఏపీకి రావడానికి తలవంపులుగా లేదా అని ఏపీ సీఎం చంద్రబాబు గురువారమే ప్రధాని మోడీకి లేఖ రాశారు.
READ MORE

English summary
Prime Minister Narendra Modi Visakhapatnam tour live updates. Two days before Centre announced Visakhapatnam railway zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X