విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమాజ సేవ కోసమే పార్టీ ఏర్పాటు.. ప్రజల సేవ కోసమే: పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

జనసేనాని పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. తనపై.. పార్టీ గురించి కామెంట్స్ చేసేవారికి అదే రేంజ్‌లో ఆన్సర్ ఇస్తున్నారు. తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు. సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తాను పార్టీని నడుపుతున్నానని, సినిమా హాల్‌ను నడపడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయమని చెప్పారు.

ఎత్తెన కట్టడం కట్టాలంటే..లోతైన పునాది వేయాలని సామెత గుర్తుచేశారు. పునాది వేసి ఏడేళ్లవుతుందని, బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంలే జనసైనికులు క్రమశిక్షణతో ఉండాలని పవన్‌కల్యాణ్ సూచించారు. వైసీపీ నేతలకు మాట్లాడడం రాదు, అరుపులు, కేకలు తప్ప. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికా మిమ్మల్ని ఎన్నుకుంది? సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే..ప్రజలు ఆకలి తీరుతుందా? చదువుకోవాల్సిన 10 ఏళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.

party established because people mandate:pawan kalyan

వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2024లో వైసీపీని ఓడించాలంటే జనసైనికుల్లో ఐక్యత ముఖ్యం అని పవన్‌ కల్యాణ్ చెప్పారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో జనసేన క్రియాశీలక కార్యకర్త పిల్లా శ్రీను ప్రాణాలు కోల్పోయారు. పిల్లా శ్రీను విశాఖ జిల్లా అనకాపల్లి నియజకవర్గానికి చెందిన జనసైనికుడు. పిల్లా శ్రీను మృతి వార్తతో పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

Recommended Video

YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu

పిల్లా శ్రీను కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఓదార్చారు. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును స్వయంగా అందజేశారు. జనసేన క్రియాశీలక కార్యకర్తల సభత్వాల నమోదును ఇటీవలే పూర్తి చేసిన పార్టీ హైకమాండ్... వారికి ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం తెలిసిందే. ఆ క్రమంలోనే బీమా చెక్ అందజేశారు. శ్రేణులు/ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకుంటామని స్పష్టంచేశారు. సంక్షేమం, అభివృద్ది కోసమే పోరాడుతున్నామని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.

English summary
janasena cheif pawan kalyan speaks to party establishment. establish a political party is people mandate he said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X