యువతి స్నానం చేస్తుండగా చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిన యువకుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: భారత్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నగరంలో నీచమైన పనికి పాల్పడ్డాడు. తనతోపాటు అదే కంపెనీలో పని చేస్తున్న మహిళను మొబైల్ ఫోన్ లో నగ్నంగా చిత్రీకరించాడు.

దారుణం: ప్రార్థన కోసం వచ్చిన అమ్మాయిని.. చర్చ్ ఫాదర్ ఏం చేశాడంటే...

ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ యువతి(28) రాత్రి సమయంలో కంపెనీలోని బాత్‌రూంకు వెళ్లడాన్ని గమనించిన ఈ యువకుడు పక్కనే ఉన్న మరో రూం నుంచి యువతిని తొంగిచూశాడు.

man-filming-woman

ఆమె నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో మహిళను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. బాత్‌రూంలోని అద్దంపై సెల్‌ఫోన్ ప్రతిబింబం మెరవడంతో ఆ యువతి అప్రమత్తమై వెనుదిరిగి చూసి షాక్ కు లోనైంది.

ఆపైన ఆ యువకుడిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తూ, దుర్భాషలాడింది. ఏడ్చుకుంటూ ఆ విషయాన్ని తోటి సిబ్బందికి కూడా తెలిపింది. దీంతో కంపెనీ అధికారులు వెంటనే అందరి వద్ద సెల్‌ఫోన్ల తీసుకుని వాటిలోని వీడియోలను డిలీట్ చేశారు.

అనంతరం బాధిత యువతి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఆ యువకుడు తనకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఏమైనా చిత్రీకరించాడేమోననే అనుమానాన్ని బాధితురాలు వ్యక్తం చేసింది.

ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని అల్ రఫా పోలీసులు తెలిపారు. నిందితుడు క్లర్క్‌గా పనిచేస్తున్నాడని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man, accused of filming a woman secretly as she was showering, is on trial. The Court of First Instance heard the 21-year-old Indian man, an office assistant, peeped through a small air hole in the bathroom wall and secretly filmed the woman with his mobile phone at her staff accommodation. He has been charged with breaching a woman's modesty and privacy, which he denied in court. The incident was reported to Al Rafaa police station on October10."At around midnight, I was in the shower in my accommodation when I suddenly spotted the reflection of a man filming me with his mobile phone in the mirror. I turned around and saw him standing at the window of his room, which was adjacent," the 28-year-old Filipina complainant, a receptionist, said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి