AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..!
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results 2026) ఎప్పుడు అనే దానిపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ ఈ ఫేక్ ప్రచారాలతో వారిలో టెన్షన్ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై జరుగుతున్న ప్రచారాలపై ఇంటర్ బోర్డు ఇవాళ స్పందించింది. ఈ మేరకు ఫలితాలపై క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రాసిన అభ్యర్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే కొనసాగుతోంది. ఇది త్వరలోనే పూర్తవుతుందని, ఈ నెల 12వ తేదీన ఫలితాల విడుదలకు బోర్డు సిద్దమవుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అభ్యర్ధులు ఉత్కంఠగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఈ నెల 12న ఇంటర్ ఫలితాల విడుదల అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ రూమర్లను నమ్మొద్దని తెలిపింది.

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 9తో ముగియబోతోంది. ఆ తర్వాత ఫలితాల ప్రాసెసింగ్, కంప్యూటరీకరణకు ఇంకో ఆరు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తి అయిన తర్వాత ఈ నెల మూడోవారంలో ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయి, మార్కుల కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ఫలితాలపై ప్రకటన చేయనుంది.
-
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
ఏపీలో 75 లక్షల పేద కుటుంబాలకు గుడ్ న్యూస్-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
Vijayawada lulu mall: విజయవాడలో లులూ మాల్ కు సర్కార్ షాక్-హైకోర్టులో..! -
నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీల పై కీలక నిర్ణయం .. ఇక నుంచి..!! -
అమరావతి ఇక ప్రత్యేకంగా - తాజా నిర్ణయం, కీలక మలుపు..!! -
రేపు ఇంటర్ ఫలితాలు, ఈ సారి ప్రత్యేకంగా - ఎలా తెలుసుకోవాలంటే..!! -
ఏపీలో స్లీపర్ బస్సుల రద్ధు? సర్కార్ సంకేతాలు..! -
TG Inter Result: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆరోజే..? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్














Click it and Unblock the Notifications