హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాన్ ఫ్రాన్సిస్కో తర్వాత హైదరాబాదే!: ఉబర్ బైక్ ట్యాక్సీ చార్జీలు ఎంతంటే?

తమ సంస్థకు శాన్ ఫ్రాన్సిస్కో తర్వాత ఎక్కువ ఉద్యోగులు ఉన్నది హైదరాబాద్ లోనే అని ఉబర్ సీఈవో ట్రవిస్ కలనిక్ తెలిపారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ ట్రాన్స్ పోర్ట్ సేవలను బైక్ ట్యాక్సీ రంగానికి కూడా విస్తరించిన ఉబర్.. వచ్చే ఏడాది ఆరంభం నుంచి హైదరాబాదీలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ బస్సుల టెన్షన్ లేకుండా ఈ బైక్స్ పై సాఫీగా తమ ప్రయాణం కొనసాగించవచ్చు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం బేగంపేటలోని ప్రగతి భవన్ లో జెండా ఊపి ఉబర్ ట్యాక్సీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉబర్ వ్యవస్థాపకుడు, సీఈఓ ట్రవిస్ కలనిక్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబర్ మోటో సర్వీసుల ఒప్పందంపై సంతకాలు చేశారు.

తెలంగాణ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరగ్గా.. మెట్రో స్టేషన్లను అనుసంధానం చేస్తూ ఈ బైక్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఉబర్ ప్రతినిధులు పేర్కొన్నారు.

బైక్ ట్యాక్సీ చార్జీలు:

CM KCR Launches Uber Moto Two Wheeler Taxis at Pragati Bhavan

ఉబర్ మోటో బైక్ ట్యాక్సీ కనీస చార్జీని రూ.20గా నిర్ణయించారు. మోటో బైక్ షేరింగ్ ద్వారా మూడు కి.మీ పరిధికి ఈ కనీస చార్జీ వర్తిస్తుంది. మూడు కి.మీ తర్వాత కి.మీకి రూ.5 చొప్పున చార్జీ చేస్తారు. ప్రస్తుతం బైక్ ట్యాక్సీ డ్రైవర్లకు ఆన్ లైన్ లావాదేవీలు, జీపీఎస్ ఉపయోగం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కో తర్వాత హైదరాబాదే:

CM KCR Launches Uber Moto Two Wheeler Taxis at Pragati Bhavan

తమ సంస్థకు శాన్ ఫ్రాన్సిస్కో తర్వాత ఎక్కువ ఉద్యోగులు ఉన్నది హైదరాబాద్ లోనే అని
ఉబర్ సీఈవో ట్రవిస్ కలనిక్ తెలిపారు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ట్రవిస్ అంగీకరించారన్నారు.

ఉబర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని, ఆ కార్యాలయం తర్వాత అత్యధిక ఉద్యోగులను ఉబర్ హైదరాబాద్ లోనే నియమించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉబర్ తరుపున హైదరాబాద్ లో 2వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు తెలియజేశారు.

ఉబర్ బైక్ ట్యాక్సీ ఎలా బుక్ చేయాలి?

CM KCR Launches Uber Moto Two Wheeler Taxis at Pragati Bhavan

తొలుత ఉబర్ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఉబర్ మోటో అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని.. మీ లొకేషన్ ను ఎంటర్ చేయాలి. బ అనంతరం స్క్రీన్ మీద చూపించే సమాచారాన్ని అనుసరిస్తూ బైక్ ట్యాక్సీని బుక్ చేసుకోవాలి.

ప్రయాణంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడికి కూడా హెల్మెట్ ఇస్తారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటిస్తారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, 2 వే ఫీడ్‌బ్యాక్, బంధుమిత్రులతో ఈ ప్రయాణం గురించి తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. చార్జీలను నగదు లేదా ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చు.

English summary
Now Kalanick is in Hyderabad, and looking dapper in a white and red shawl, he’s launched UberMotos in the city in the presence of Telangana Chief Minister K. Chandrashekar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X