హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లో కిరీటి వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
రాష్ట్ర రాజకీయాల్లో అర్జునుడి లాంటివాడు వైయస్ రాజశేఖర రెడ్డి. అతని నిరంతరం సలహాలు అందిస్తూ ముందుకు నడిపించేవాడు ఆయన సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు. వ్యూహం కెవిపిదైతే ఆచరణ వైయస్ ది. కెవిపి రామచంద్రరావు రచించిన వ్యూహాన్ని సమర్థంగా ఆచరణలో పెట్టిన రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి. శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అన్నంతగా వీరిద్దరు కలిసిపోయారు. దీంతో రాజకీయ విలుకాడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్షాలపై పైచేయి సాధించడంలో విజయం సాధిస్తూ వచ్చారు. పార్టీ లోపలా, బయటా రాజశేఖర రెడ్డి తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. వెన్నంటి ఉన్న అనుచరులకు ఎలాంటి అభయ హస్తం అందించేవాడో ప్రత్యర్థులపై అంత సూటిగానూ యుద్ధం ప్రకటించిన నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి.

ముఖ్యమంత్రిగా 2004లో పదవి చేపట్టినప్పటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహార శైలే పూర్తిగా మారిపోయింది. నిత్య అసమ్మతివాదిగా పేరు పొందిన వైయస్ అధికార రాజకీయాలు నడపలేడనే అపోహ ఉండేది. అది అపోహ మాత్రమేనని ఆయన నిరూపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును నైతికంగా దెబ్బ తీయడంలో ఆయన ఎనలేని తెగువను ప్రదర్శించాడు.

తెరాస అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంత్రివర్గంలో చేరిన తర్వాత తెరాస ఉనికిని దెబ్బ తీసేందుకు నిరంతరం పనిచేశారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలహీనపరిచే పనికి పూనుకున్నారు. తెరాస నాయకుల చేతనే ఆయన ఆ పార్టీని బలహీన పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. 2009 ఎన్నికల్లో తెరాసతో పొత్తును కరాఖండిగా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూనే సమైక్యవాదాన్ని బలంగా నిలబెట్టిన నాయకుడు ఆయన. దాదాపుగా తెరాస ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన నిరంతరం ఎదురుదాడినే అస్త్రంగా ఎంచుకున్నారు. ఎదురుదాడితో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ప్రతిపక్షాలను ఇంతగా ఆత్మరక్షణలో పడేసిన కాంగ్రెసు నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు.తనను నమ్మినవారికి అభయహస్తం అందించడం వల్లనే ఇంతగా ఆయన నిలదొక్కుకోగలిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X