వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా వెసులుబాటుకే చిరంజీవి..

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఊపిరి పీల్చుకున్నట్లే ఉన్నారు. ఆయనకు పెద్ద భారం దిగినట్లే అనిపించి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ పార్టీ నాయకులకు క్షణం తీరిక లభించడం లేదు. విపరీతమైన పోటీ కారణంగా పార్టీల అధ్యక్షులు, నాయకులు ప్రజల ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబులకు దీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు పోరాట కార్యక్రమాలను చేపట్టాల్సిన అనివార్యతలో చిరంజీవి పడ్డారు. దీంతో ఆయకు ఏ మాత్రం తీరిక లభించడం లేదు. దీనికి తోడు, ఎంతగా తిరిగినా, చెమటోడ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కూడా ఆయనకు ఉన్నట్లు లేదు. దీంతో ఆయన రాజకీయాలతో విసిగిపోయినట్లే ఉన్నారు.

ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ తన ప్రతిష్టాత్మకమైన 150 చిత్రాన్ని పూర్తి చేయాలని ఆయన అనుకున్నారు. కానీ, పార్టీ అధ్యక్షుడిగా ఏదో కార్యక్రమం నెత్తి మీదికి వచ్చి పడుతోంది. దీంతో మళ్లీ ప్రజల మధ్యకు పరిగెత్తాల్సి వస్తోంది. దీంతో సినిమా నిర్మాణం వెనక్కి వెళ్లిపోతోంది. దానికి తోడు, రాజకీయాల్లో తగిన ఫలితం రాకపోవడంతో తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోవాలనే ఆలోచన కూడా చిరంజీవిలో ఏదో మూలన ఉన్నట్లు చెబుతన్నారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేయడం వల్ల అందుకు తగిన అవకాశం లభించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ఆయన మంత్రివర్గంలో చేరే అవకాశాలు లేవని చెబుతున్నారు. మంత్రి పదవి తీసుకుంటే మళ్లీ సినిమాకు అడ్డంకులు వస్తాయని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

తాను ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సినిమాను ఏడాది లోగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా తన రాజకీయాలకు ఉపయోగపడేలా ఉండాలని కూడా ఆయన అనుకుంటున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మనోగతం మరో విధంగా ఉంది. చిరంజీవిని ప్రచారం కోసం విరివిగా వాడుకోవాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యతను చిరంజీవికి అప్పగించే అవకాశం ఉంది. అదే విధంగా పులివెందుల, కడప ఉప ఎన్నికల ప్రచారంలో కూడా చిరంజీవి పాల్గొనాల్సి రావచ్చునని అంటున్నారు. అంతేకాకుండా, త్వరలో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా చిరంజీవిని ప్రయోగించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో స్టార్ కాంపైనర్‌గా చిరంజీవిని తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ముందుకు తీసుకు రావచ్చునని అంటున్నారు. అయితే, కాంగ్రెసు రాజకీయాలు చిరంజీవిని ముందు పడనిస్తాయా అనేది అనుమానమే.

English summary
With the merger of his party in Congress, Chiranjeevi may get time to complete his prestigious film production. As a PRP president it was happened to be busy in politics. As Congress party leader he is going to fulfill his dream in cinema field. He may become star campaigner for Congress party in ensuing in Tamilnadu bye-polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X