విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమ్మకులంలో ముసలం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Devineni-Vallabhaneni war in Vijayawada
విజయవాడ రౌడీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. గతంలో కమ్మ-కాపు మధ్య కుల సంగ్రామాలు కొన్ని దశాబ్దాల పాటు జరిగాయి. అటూ ఇటూ ఎందరో హత్యలకు గురయ్యారు. ఈ రౌడీయిజం వల్ల ఆ వర్గమూ ఈ వర్గమూ సంపన్నులయ్యారు, రాజకీయ పదవులు అనుభవించారు. నష్టపోయినది అమాయకులైన రెండు వర్గాల అనుచర గణమే. వంగవీటి రంగా ఎదుగుదల, హత్య రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన విషయం తెలిసిందే. పాతికేళ్ళ క్రితమే వైయస్ రాజశేఖరరెడ్డిని కోస్తా జిల్లాల వారికి పరిచయం చేసి కాపు, బిసి, ఎస్ సి నాయకులను వైయస్ కు అనుకూలంగా మలిచింది వంగవీటి రంగానే. రంగా మరణం తర్వాత కూడా ఆయన కుటుంబీకులకు, కమ్మ గ్యాంగ్ లీడర్లకు కొంత కాలం గ్యాంగ్ వార్స్ జరిగాయి.

ఇప్పుడు కాపు ఫ్యాక్టర్ దాదాపు చెరిగిపోయింది. రంగా కుమారుడు రాధాకృష్ణ ఒక టెర్మ్ కాంగ్రెసు ఎమ్మెల్యేగా పనిచేసినా, గత ఏడాది ప్రజారాజ్యంలోకి ఫిరాయించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కొంత గ్యాంగ్ ఉన్నా ఒక పెద్ద యుద్దం నడపడానికి అది సరిపోదు. ఈ నేపధ్యంలో కమ్మవారే రెండు పార్టీలుగా, రెండు గ్యాంగ్ లుగా మారిపోయి ఘర్షణలకు సిద్ధమవుతున్నారు. టిడీపి నుంచి కాంగ్రెసు లోకి వచ్చి గత ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని నెహ్రూ కుమారుడు ఇప్పుడు పెద్ద రౌడీగా మారడం చరనీయాంశమైంది. తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ తో అతను ముఖాముఖి ఢీకొనడానికి సిద్ధమయ్యాడు. దీనితో కమ్మకులంలో ముసలం మొదలైనట్టు కన్పిస్తోంది. గతంలో పార్టీలు వేరైనా కులంగా కమ్మవారిలో అంతర్గతంగా ఒక ఐక్యత కన్పించేది. ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయి.

కాంగ్రెసు నేత దేవినేని నెహ్రూ, టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్‌ మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై నెహ్రూ రౌడీయిజం చేస్తున్నారని, భయభ్రాంతులకు గుర్తిచేస్తున్నారని వంశీ ఆరోపించారు. నెహ్రూ అన్యాయాలను చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

వంశీ వ్యాఖ్యలు అమానుషమని నెహ్రూ అన్నారు. మద్దలచెరువు సూరిని చంపడానికి వంశీ సుపారీ (హత్యకు డబ్బు) తీసుకున్నాడని ఆయన ఆరోపించారు. మరోవైపు నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ సీతారామాంజనేయులు దేవినేని, వంశీ వర్గీయులను హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X