వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌కు ఫోన్ చేసి 'గాలి'కి షాకిచ్చారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu - YS Rajasekhar Reddy
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశానని, మాట్లాడమంటూ మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడుకు ఓ నిమిషం షాక్ ఇచ్చారు. కాసు మీడియాతో మాట్లాడుతుంటే అటుగా వెళ్తున్న గాలి ముద్దుకృష్ణమ అక్కడ ఆగారు. ఏం జరుగుతోందని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తానూ కలిసి తిరగడం.. ఢిల్లీలో ఒకే హోటల్ గదిలో ఉన్ననాటి సంగతులు చెబుతున్నానని కాసు చెప్పారు.

ఒకే గదిలో ఉండటం విషయమే కాదని, ఏం చేశారో కూడా చెప్పాలని గాలి అతనికి సూచించారు. దానికి కాసు బదులిస్తూ... ఏం చేసినా వారిద్దరేనని, తాను ఎక్కువగా కలిసే వాడిని కాదన్నారు. ఆ తర్వాత కాసు జేబులోంచి సెల్ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి... ఆ రోజు మనతో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణించిన గాలి ముద్దుకృష్ణమ మాట్లాడుతారట.. అని ఫోన్‌ను గాలికి ఇచ్చాడు. గాలి హలో హలో అన్నా అవతలి నుండి ఎవరు పలకలేదు.

ఎవరికి ఫోన్ చేశావని కాసును అడిగారు. అందుకు అతను వైయస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశానని, మాట్లాడమని చమత్కరించారు. దాంతో గాలి ఓ నిమిషం షాక్‌కు గురయ్యారు. అనంతంర వైయస్ ఫోనేమిటయ్యా బాబు... నువ్వే మాట్లాడుకో అని ఫోన్ తిరిగి ఇచ్చారు. కాసు అంత సీరియస్‌గా సెల్ ఫోన్ తీసి నెంబర్ కొట్టి గాలి ముద్దుకృష్ణమకు ఇవ్వడం అక్కడ ఉన్న వారందరినీ కాసేపు నవ్వించింది.

ఈ సందర్భంగా.. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక తాను, కాసు, వైయస్ ఉన్నప్పుడు జరిగిన ఒక సంభాషణను గాలి ముద్దృకృష్ణమ చెప్పారు. హెలికాప్టర్లో తాము ముగ్గురమే ఉన్నామని, 2004లో డబ్బు లేకుండానే అంతా గెలిచామని, ఇప్పుడు ఇంత అత్యాశ మంచిది కాదని తాను చెప్పానని అన్నారు. అప్పుడు వైయస్‌.. అవతలి వాళ్లకు టివిలు, పేపర్లు అన్నీ ఉంటే మనకు ఉండొద్దా, డబ్బులు కావద్దా అని సమర్థించుకున్నారని, దీనికి కాసు ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. నిజమేనంటూ కాసు తలూపారు.

English summary
Minister Kasu Venkata Krishna Reddy has dail a number and gave phone to TDP senior leader Gali Muddukrishnama Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X