కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్య: నారా లోకేష్‌ మీదనేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం కర్నూలులో చేసిన ఓ వ్యాఖ్య కలకలం రేపుతోంది. అది తీవ్ర వివాదంగా కూడా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై ఆయన ఎడతెగని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

TDP leaders Protest BJP MLC's Remarks Against Babu

తన విమర్శల దాడిలో భాగంగానే ఆయన కర్నూలులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నంద్యాల రోడ్డులో గల శకుంతల కల్యాణ మండపంలో ఆదివారం ఆయన కర్నూలు నియోజకవర్గ స్థాయి మహా సమ్మేళనంలో మాట్లాడారు.

 ఆ వ్యాఖ్య లోకేష్ మీదనేనా...

ఆ వ్యాఖ్య లోకేష్ మీదనేనా...

తమ పార్టీ కొడుకుల కోసం పుట్టిన పార్టీ కాదని, దేశ నిర్మాణం కోసం పుట్టిన పార్టీ అని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు తన కుమారుు నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

 చంద్రబాబు తన బొమ్మను ముద్రించుకుని...

చంద్రబాబు తన బొమ్మను ముద్రించుకుని...

ఎల్ఈడి బల్బులు ఇచిచన ఘనత బిజెపిదేనని, రాష్ట్రానికి కేంద్రం కోటి బల్బులు ఇస్తే మోడీ బొమ్మను కాదని చంద్రబాబు తన బొమ్మను ముద్రించుకున్నారని, ఇది విడ్డూరంగా ఉందని సోము వీర్రాజు అన్నారు.

 అది మోడీ పుణ్యమేనని...

అది మోడీ పుణ్యమేనని...

ప్రస్తుతం రోజుకు 24 గంటల విద్యుత్తు సరఫరా ఉందంటేఅది ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమేనని సోము వీర్రాజు అన్నారు. సోలార్ పరిశ్రమకు రూ. వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని చెప్పారు. జీవన్ జ్యోతి యోజన కింద రాష్ట్రంలోని విద్యు సబ్ స్టేషన్లకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చిందని ఆయన చెప్పారు.

 మోడీకి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు

మోడీకి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న మోడీ తల్లి ఆటోలో ఆస్పత్రికి వెల్లి వైద్యం చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

 ఈ ప్రాజెక్టులు పూర్తి చేయగలదా...

ఈ ప్రాజెక్టులు పూర్తి చేయగలదా...

పోలవరం ప్రాజెక్టును 2019 నాటకి పూర్తి చేస్తామని కేంద్రం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పిందని సోము వీర్రాజు అన్నారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయగలదా అని ఆయన ప్రశ్నించారు.

English summary
BJP MLC Somu Veerraju has attacked Andhra Pradesh CM Nara Chnadrababu Naidu at Kurnool meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X