హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: త్వరలో తన పార్టీ పేరు ప్రకటిస్తానని, ఉప ఎన్నికలకు ముందే పార్టీ ఉంటుందని, ఉప ఎన్నికలలో కూడా పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని చెప్పిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీకి సాంకేతిక సమస్యలు తలెత్తాయనే వాదనల నేపథ్యంలో జగన్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రామన్న రాజ్యం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పేర్లు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పేర్లకు ఇంతలో అనుమతి లభించే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పటికే శివకుమార్ అనే వ్యక్తి పేరుట రిజిస్టర్ అయి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. రెండురోజుల క్రితం జగన్ శివకుమార్‌తో భేటీ అయ్యారు. పార్టీ తాను తీసుకునే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. శివకుమార్ పేరిట రిజిస్టర్ అయి ఉన్న ఈ పార్టీకి అధ్యక్షుడు కూడా శివకుమారే. మొదట ఆ పార్టీలో జగన్ సభ్యత్వం తీసుకొని, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనే జగన్ ఈ పార్టీ పేరుతో హడావుడి చేసినప్పటికి జగన్ వర్గం దానిని కొట్టి పారేశారు.

English summary
Because of election commission's delay in clearence of ysr party, ys jagan seriously thinking about ysr congress party name. YS Jagan met Mr. Shiva Kumar, who registered the YSR Congress Party on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X