హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ గేటు వద్ద తెలంగాణ టిడిపి ఫోరం ఎమ్మెల్యేల ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టిడిపి ఫోరం ఎమ్మెల్యేలు గురువారం మంత్రులు లోనికి వెళ్లే అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెళ్లే ద్వారం గుండా మంత్రులు లోనికి వెళ్లారు. గేటు వద్ద బైఠాయించిన టిడిపి ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు టిడిపి ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద ధర్నా చేశారు. అక్కడి నుండి పాదయాత్రతో అసెంబ్లీకి చేరుకున్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వేరుగా గన్‌పార్కు దగ్గర ధర్నా చేసిన అనంతరం తెలంగాణ వెంటనే ప్రకటించాలనే బ్యానర్‌తో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లారు. కాగా గురువారం నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి, టిఆర్ఎస్‌లు బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకుంటామని ఇదివరకే ప్రకటించాయి. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని ప్రకటించాయి. శాసనసభ్యుల నిరసన దృష్ట్యా గవర్నర్ వేరే మార్గం గుండా శానససభ ఆవరణలోకి అడుగు పెట్టారు.

English summary
Telangana TDP Forum MLAs organized dharna at Assembly Ministers gate on thursday and demanded proposed for Telangana bill in Parliament Budget Sessions. TDP leaders warned they obstruct Governor speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X