వైయస్ జగన్ వెంట 23 మంది ఎమ్మెల్యేలే, కాంగ్రెసువారు 19 మంది

జగన్‌కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల్లో ఇద్దరేసి ప్రజారాజ్యం, తెలుగుదేశంవారు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లవురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి జగన్ వెంట నడుస్తున్నారు. ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. అది ఊహించిన విషయమే. వైయస్ జగన్ వెంట కాంగ్రెసుకు చెందిన 19 మంది శాసనసభ్యులు నడుస్తున్నారు. వీరిలో సమయం వస్తే ఎంత మంది జగన్ వెంట ఉంటారనేది కూడా చెప్పలేం. వైయస్ జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ వంటి వారే పునరాలోచనలో పడ్డారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంత మంది జారిపోతారోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, కుంజా సత్యవతి, బాబూరావు, బాలరాజు, ప్రసాదరాజు వంటి వారు మొదటి నుంచీ జగన్ వెంట నడుస్తున్నారు. వీరు మాత్రమే జగన్ వెంట ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications