ఉప ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే వేటు తప్పదు: డిఎస్

కాంగ్రెసు పార్టీ కొత్తవారికి గాలం వేస్తుందన్న వ్యాఖ్యలను డిఎస్ కొట్టి పారేశారు. కొత్తవారికి గాలాలు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైయస్ ప్రభావం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికలలో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పని చేయవద్దని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవరూ పూనుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెసుకు ప్రజలు పట్టం గడతారని అన్నారు.
కాగా మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యుడు కడప ఉప ఎన్నికలలో గెలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్రిముఖ పోరు రసవత్తరంగా ఉంటుందని ఆయన అన్నారు. కడపకు మంత్రి డిఎల్ సరైన అభ్యర్థి అన్నారు. కడప జిల్లాలో ప్రచారానికి వెళతానని చెప్పారు. వైయస్ చేసిన మంచి పనులను చెప్పుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. జగన్ కాంగ్రెసులో ఉంటే సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే హక్కు ఉండేదన్నారు.












Click it and Unblock the Notifications