చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూపీఏ నుంచి వైదొలగకూడదని డిఎంకె చీఫ్ కరుణానిధి నిర్ణయం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

DMK
చెన్నై: యూపీఏ, డిఎంకె సంబంధాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగకూడదని డిఎంకె నిర్ణయించింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులను చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సంకల్పించింది. శుక్రవారం సాయంత్రమిక్కడ పార్టీ చీఫ్ కరుణానిధి నేతృత్వంలో రెండున్నర గంటలపాటు జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 2జీ కేసులో కాంగ్రెస్ తమకు సాయం చేయనందుకు ఆ పార్టీపై ఎలాంటి వ్యతిరేకత, అసంతృప్తి లేదని కరుణ విలేకర్లతో చెప్పారు. అయితే వచ్చే నెలలో జరిగే డిఎంకె సర్వసభ్య సమావేశంలో ఇతర పార్టీలతో తమ సంబంధాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశానికి పార్టీ నేతలు ఎంకే స్టాలిన్, అన్బళగన్, కేంద్ర మంత్రులైన కరుణ తనయుడు అళగిరి, మనవడు దయానిధి మారన్ తదితరులు హాజరయ్యారు. యూపీఏ నుంచి తమ మంత్రులు వైదొలగాలని తీర్మానం ప్రవేశపెట్టాలని ముందుగా భావించారు. కరుణ కూడా దీనికి సమ్మతించారు.

అయితే పార్టీలోని ఓ వర్గం దీనికి ఒప్పుకోలేదు. కేబినెట్ నుంచి వైదొలిగితే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్నాడిఎంకె సిద్ధంగా ఉందని పేర్కొంది. కరుణకు అళగిరి నచ్చజెప్పారని, ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి నుంచి బయటకొస్తే మరిన్ని సమస్యలొస్తాయని వివరించారని సమాచారం. ఈ అంశంపై ఓ పార్టీ నేతను 2జీ కేసులో జైల్లో ఉన్న కరుణ కూతురు కనిమొళి వద్దకు పంపి ఆమె అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. తన కోసం నిర్ణయాలు తీసుకోవద్దని, కేసును ఎదుర్కొనే ందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు సమాచారం. స్కామ్‌లో డిఎంకె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజా అరెస్టు, మారన్‌పై ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వం నుంచి డిఎంకె వైదొలిగే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.

కనిమొళికి వాటాలున్న కలైంజర్ టీవీ లావాదేవీలతో 2జీ స్కామ్‌ను సీబీఐ ముడిపెట్టడాన్ని డిఎంకె తీర్మానం ఖండించింది. రుణాన్ని బ్యాంకు వ్యవహారాల ద్వారా ఓ ప్రైవేటు సంస్థ నుంచి పారదర్శకంగా స్వీకరించినట్లు తెలిపింది. 'కనిమొళి, టీవీ ఎండీ శరద్‌కుమార్‌లు విచారణకు వచ్చినప్పుడు సీబీఐ అరెస్టు చేయలేదు. వారు విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లినప్పుడు అరెస్టు చేసింది. బెయిలు ఇవ్వొద్దని కోరింది. ఇది ఆ సంస్థ ద్వంద్వ వైఖరికి నిదర్శనం" అని విమర్శించింది.

English summary
Dispelling speculation that DMK’s high-level committee could decide to snap ties with the Congress over the detention of MP Kanimozhi in the 2G scam, and pull out its ministers from the UPA-II Cabinet, party president M Karunanidhi on Friday maintained that ties between the two parties remained intact.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X