హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్‌లు గతంలో పిచ్చివాళ్లలా మాట్లాడే వారని ఇప్పుడు ఆ కోవలోకి ఎంపీ కావూరి సాంబశివ రావు చేరిపోయారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి గురువారం అన్నారు. కృష్ణా జిల్లాలను ప్రత్యేక రాష్ట్రం చేస్తారా అని ప్రశ్నించడం బాధ్యతా రాహిత్యం అన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులకు అంతగా అనుభవం లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సెంటిమెంటు దృష్ట్యా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తేనే ప్రజల్లోకి వెళ్లగలరని అన్నారు. చర్చలలో పార్టీలోని సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అక్టోబర్‌లో తెలంగాణ వచ్చి తీరుతుందని మంత్రి శంకర్ రావు వేరుగా అన్నారు. ఆత్మహత్యల కంటే రాజీనామాలు చేయడం గొప్పేమీ కాదన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతను, విద్యార్థులకు సూచించారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
Congress party senior leader Palwai Govardhan Reddy fired at MP Kavuri Sambasiva Rao today. He accused that Kavuri is taking like Lagadapati Rajagopal.
Story first published: Thursday, July 28, 2011, 14:44 [IST]