వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30మంది జగన్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: సిబిఐకి ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చిన నేపథ్యంలో వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆది, సోమ వారాలు సమావేశంలో చర్చించి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు. జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు, వైయస్ పేరు డిఇమేజ్ చేయడానికి కాంగ్రెసు కుట్ర పన్నుతుందన్న అభిప్రాయంతో ఉన్న వారు రాజీనామాలకే సిద్ధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజీనామా చేసే ఆస్కారం ఉన్న ఎమ్మెల్యేలు - బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కొర్ల భారతి, బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోసు, శేషారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బాలరాజు, ప్రసాదరాజు, ఆళ్ల నాని, గురునాథ్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రవి, బాలనాగిరెడ్డి, చెన్నకేశవ రెడ్డి, శోభానాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జయసుధ, కుంజా సత్యవతి, రాంచంద్రారెడ్డి, రామకృష్ణా రెడ్డి, ప్రసాదరాజు, సుచరిత, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖర రెడ్డిలు ఉన్నారు.

కాగా ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ముప్పై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ సమయం వచ్చే వరకు ఎంత మంది రాజీనామాలకు సిద్దపడతారో ఎంత మంది వెనక్కి తగ్గుతారో తెలియని పరిస్థితి నెలకొంది.

English summary
It seems, thirty mlas and two mps will be resigned for their post to support YSRC party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X