హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై అందరి దృష్టి, అనూహ్యంగా గాలి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్‌: సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో అందరి కళ్లూ వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్రీకరించి ఉన్న సమయంలో అనూహ్యంగా సిబిఐ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆదివారం రాత్రే బళ్లారికి చేరుకున్న సిబిఐ అధికారులు సోమవారం తెల్లవారు జామునే బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు చేపట్టారు. ఉదయం ఆరున్నర గంటలకు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి, హైదరాబాదుకు తరలించారు. జగన్‌ను రేపోమాపో అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రత్యర్థులు లెక్కలు కడుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డిని ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో సిబిఐ అరెస్టు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

గాలి జనార్దన్ రెడ్డిని, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేసిన వార్త కొద్ది గంటల్లో గుప్పుమంది. గాలి జనార్దన్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా, శ్రీనివాస రెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చిన కేసులో సిబిఐ 85 మంది సాక్షులను విచారించినట్లు సమాచారం. అరెస్టుపై ఉన్న స్టేను సిబిఐ వెకేట్ చేయించుకున్న విషయం కూడా రహస్యంగానే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం గాలి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, అనుచరుడు శ్రీరాములు ఇళ్లలో సిబిఐ సోదాలు చేపట్టింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు రాజగోపాల్, లక్ష్మిలను సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
While all eyes are YS Jagan's assets case, CBI unexpectedly arrested Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X