హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి కేసు: ఇరుకున పడిన సబితా ఇంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గ సభ్యులకు కొంత మందికి చుట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుత హోం మంత్రి, మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందులో నిండా మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి రిమాండ్ రిపోర్టును బట్టి ఆ కేసు సబితా ఇంద్రారెడ్డికి కూడా చుట్టుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ మంగళవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. రిమాండ్ రిపోర్టు తమ వద్ద ఉందంటూ సబితా ఇంద్రారెడ్డికి కటకటాలు తప్పవా అనే ప్రశ్న వేస్తోంది ఆ చానెల్.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం - గాలి జనార్దన్ రెడ్డికి గనులు లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవోపై ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి సంతకంతో పాటు సబితా ఇంద్రారెడ్డి సంతకం కూడా ఉంది. ఆ జీవోల నుంచి క్యాప్టివ్ మైనింగ్ అనే పదం మాయం కావడం వల్లనే శ్రీలక్ష్మి కేసులో ఇరుక్కున్నారనే అభిప్రాయం దృఢంగా ఉంది. బ్రాహ్మణి స్టీల్స్‌కు క్యాప్టివ్ మైన్స్ కింద ఇవ్వాల్సిన లీజును దాన్ని ఎగరగొట్టేసి అప్పనంగా గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. దాంతో సబితా ఇంద్రారెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు లేవని అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ప్రశ్నించారు. కేసులో ఆమెను ఓ సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు ప్రశ్నించారని ఇప్పటి వరకు అనుకుంటూ వస్తున్నారు. మరోసారి సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించి, నిందితురాలిగా చేరుస్తారా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్రీలక్ష్మి రిమాండ్ రిపోర్టులో సిబిఐ స్పష్టంగా సబితా ఇంద్రారెడ్డి పేరును ప్రస్తావించడాన్ని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రధానంగా ప్రస్తావించింది. కాగా, ఈ కేసులో సిబిఐ డిసెంబర్ 3వ తేదీలోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. శ్రీలక్ష్మిని మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ఆమె చెప్పే సమాచారంపై ఆధారపడి సబితా ఇంద్రారెడ్డి విషయంలో ముందుకు సాగుతారా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.

English summary
According to ABN - Andhrajyothy TV channel - home minister Sabitha Indra Reddy is in trouble regarding Gali Janardhan Reddy's illegal mining case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X