వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ తీరు సరిగా లేదు: కుంజా సత్యవతి కంటతడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

kunja sathyavathi
హైదరాబాద్: ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి సోమవారం అసెంబ్లీ లాబీల్లో కంటతడి పెట్టారు. జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కన్వీనర్‌గా ఉన్న తన భర్తను సస్పెండ్ చేశారని తెలుసుకున్న ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు సరిగా లేదని ఆక్షేపించారు. అవిశ్వాసంపై ఆయన మమ్మలన్ని సంప్రదించలేదని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై తమకు అభిమానం ఉందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. జగన్ వచ్చినా ఇంతకు మించి ఏమీ చేయలేరన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదని ఆ విషయం యువనేతకు కూడా చెప్పామన్నారు.

కాగా మేమిద్దరం నిక్కచ్చిగా ఉన్నామని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మూజువాణి ఓటుతో అవిశ్వాసం ముగిస్తారని జగన్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, ఓటింగ్‌కు వస్తే వారి వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఓటింగ్ కోరతారో లేదో చూడాలన్నారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో జగన్ వర్గం ఎమ్మెల్యేలతో మంత్రులు బాలరాజు, వట్టి వసంత కుమార్ భేటీ అయ్యారు. ధర్మాన కృష్ణదాసు, ప్రసాదరాజులతో వట్టి భేటీ అయ్యారు. కెవిపి రామచంద్రా రావు కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Bhadrachalam MLA Kunja Sathyavathi wept at Assembly premises today. She accused YS Jagan's attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X