హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్చకు డేట్, టైమ్ చెప్పు: అంబటికి పయ్యావుల సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు దమ్ముంటే తేది, సమయం ప్రకటిస్తే తాను ఎమ్మార్ అక్రమాలలో బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం సవాల్ విసిరారు. ఆయన ఉదయం మీడియాకు 11 అంతస్థుల భవనాన్ని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భువితేజ కేటాయింపులు అక్రమమన్నారు. అక్రమాలు రుజువు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వం వెంటనే భువితేజ అక్రమాలపై విచారణ జరపాలన్నారు. అక్రమంగా కేటాయించిన వాటిని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎపిఐఐసిలో అంబటి అక్రమాలపై ఇప్పుడు మాట్లాడుతున్న శివసుబ్రహ్మణ్యం ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారన్నారు. ఎమ్మార్ విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని, వారం రోజుల్లో స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

కాగా అప్పనంగా విలువైన భూమిని కొట్టేసిన భువితేజ కుంభకోణం వెనక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బృందం ఉందని పయ్యావుల శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో అప్పటి ఎపిఐఐసి చైర్మన్ అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని, తేజ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ అప్పనంగా పాతిక కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొట్టేసిందని, ఒక పెట్రోలు బంకు కట్టుకుంటామని చెప్పి ఏకంగా 11 అంతస్తుల భవనం కట్టేస్తున్నారని, పైసా పెట్టుబడి లేకుండా తేజ ఎంటర్‌ప్రైజెస్ ఇంతగా లబ్ధి పొందడానికి బి.పి. ఆచార్య హస్తలాఘవమే కారణమని ఆయన ఆరోపించారు.

English summary
TDP leader Payyavula Keshav challenged YSR Congress Party spokes person Ambati Rambabu about EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X