అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీతో కాంగ్రెసుకు ముప్పే: జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
అనంతపురం: ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులన్నీ ఏకం కాకపోతే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ముప్పు తప్ప దని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సోజీరావు కూతురు వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ఆయన హిందూపురానికి వచ్చారు. రాష్ట్ర కేబినెట్‌లో తనకు చోటు దక్కకపోవడానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అడ్డు కోవడం కారణం కాదని, అయినా తనను వా ళ్లేం చేస్తారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అయినా వారేం చేస్తారని ప్రశ్నించారు. అధిష్ఠానం అంగీకరిస్తే పదవులు అవే వస్తాయన్నారు.

అనుచరులకు నామినేటెడ్ పదవుపై మాట్లాడుతూ 'అవి వచ్చేవా? పొయ్యేవా? అయినా ఏదో డైరెక్టర్, లేదా ఇతర పదవుల కోసం ప్రయత్నించేది లేద'ని తెగేసి చెప్పారు. జిల్లాకు చెందిన కొందరు పొగరుతో 96 ఓట్లు అధికంగా ఉన్నాయని భావించి ఎవరి అవసరం లేదన్నం దుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని మంత్రులను పరోక్షం గా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, విభేదాలు సహజమని, ఎప్పుడై నా ఒకతాటిపైకి రాక తప్పదన్నారు. అందు కోసం తన వంతు కృషి చేస్తాన న్నారు. కార్యకర్తల కోసం నియోజకవర్గాల వారీగా పర్యటి స్తానన్నారు. హిందూపురంలో కాంగ్రెస్ పార్టీకి బలముందని, స్థానిక నాయకుల మధ్య విభేదాలతోనే పార్టీ దెబ్బతింటోందన్నారు. త్వరలో జరుగబోయే మునిసిపల్ ఎన్నికల నాటికి ఇక్కడి గ్రూపులను ఒక్కటి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Congress senior MLA JC Diwakar Reddy said that Congress has to face threat from YS Kagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X